»   » చిరంజీవి, 80వ దశకం స్టార్స్ చైనా ట్రిప్... ఫుల్లుగా ఎంజాయ్ చేశారు (ఫోటోస్)

చిరంజీవి, 80వ దశకం స్టార్స్ చైనా ట్రిప్... ఫుల్లుగా ఎంజాయ్ చేశారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజులుగా చైనాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఫ్యామిలీతో పాటు, తమిళం, మళయాలం పరిశ్రమ నుండి మరికొందరు స్టార్స్ తమ తమ ఫ్యామిలీలతో చైనాలో పర్యటిస్తున్నారు.

చిరంజీవి చైనా పర్యటనకు బయల్దేరి వెళ్లిన కొన్ని గంటలకే తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద విషాదం... దాసరి మరణం చోటు చేసుకుంది. అయితే తిరిగి వెనక్కి రాని పరిస్థితులలో ఉన్న చిరంజీవి అక్కడి నుండి దాసరికి కండోలెన్స్ ప్రకటించారు. చైనా నుండి తిరిగి హైదరాబాద్ వచ్చిన వెంటనే చిరంజీవి దాసరి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

మెగాస్టార్‌ చైనా ఎందుకు వెళ్లారో తెలుసా?

మెగాస్టార్‌ చైనా ఎందుకు వెళ్లారో తెలుసా?

ప్రతీయేటా దక్షిణాదికి చెందిన 80వ దశకం నటీనటులందరూ ఏదో ఒక ప్రాంతంలో సమావేశం అవుతుంటారు. రజినీకాంత్‌, చిరంజీవి, మోహన్‌లాల్‌, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి అగ్రనటులతోపాటు ఇతర హీరోలు, హీరోయిన్లు ఆ సమావేశంలో పాల్గొనడం గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది.

ఈ సారి చైనాలో

ఈ సారి చైనాలో

ఇప్పటి వరకు చెన్నై, హైదరాబాద్‌, కొచి తదితర ప్రాంతాల్లో ఈ సమావేశాలు జరిగాయి. అయితే ఈ ఏడాది ఆ సమావేశం చైనాలో జరుగుతోందని, ఇతర నటీనటులతోపాటు చిరంజీవి కూడా అందుకే చైనా వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో ఉన్నవారు అందుకే వీళ్లెవరూ దాసరి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు.

ఎవరెవరు వెళ్లారు?

ఎవరెవరు వెళ్లారు?

చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ ఈ సమావేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. తమిళ సినీ పరిశ్రమ నుండి నటి రాధిక, దర్శకుడు, నటుడు భాగ్యరాజ్, లీజీ, సుహాసిని మరికొందరు దక్షిణాది నటులు వెళ్లారు.

సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్

సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్

చైనా ట్రిప్పుకు సంబంధించిన ఫోటోలను కుష్భూ, రాధిక మరికొందరు స్టార్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేశారు. ఇపుడు ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.

మధురానుభూతులు

మధురానుభూతులు

ప్రతీయేటా దక్షిణాదికి చెందిన 80వ దశకం నటీనటులందరూ ఏదో ఒక ప్రాంతంలో సమావేశం అవుతుంటారు. అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా గడుపుతారు. ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండే ఈ సీనియర్ స్టార్లకు ఇదో ఆటవిడుపులా మారింది.

English summary
The reunion of 80s stars was initiated by then top actresses Radhika and Suhasini some years ago. From then on, 80s stars picked out a different location every year and celebrated the occasions. This year's edition of 80s stars was held in China. The stars were cheered up visiting the exotic places from Beijing, Shanghai and other cities of China.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu