»   » ఫోటోలు : మళ్లీ ఇరగదీస్తానంటోన్న ముమైత్ ఖాన్

ఫోటోలు : మళ్లీ ఇరగదీస్తానంటోన్న ముమైత్ ఖాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒకప్పుడు ఐటం సాంగులతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఊర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఈ మధ్య జోరు కాస్త తగ్గించిన విషయం తెలిసిందే. సెక్సీ ఒంపు సొంపులతో, కైపెక్కించే ఒయ్యారాలతో శృంగార ప్రియులకు నిద్రలేకుండా చేసిన ఈ భామ మళ్లీ ఐటం సాంగులతో, అందాల ఆరబోతతో ఇండస్ట్రీని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది.

దక్షిణాదిలో తెలుగు, తమిళంతో పాటు ఇతర పరిశ్రమల్లో ఆమెకు మళ్లీ ఐటం సాంగుల అవకాశాలు వస్తున్నాయి. తమిళ మూవీ 'ఆర్య సూర్య'లో ఆమె ప్రస్తుతం ఐటం సాంగులో నటిస్తోంది. ఇటీవలే దీనికి సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరిగింది. తిరిగి మళ్లీ ఐటం సాంగుల్లో నటించడంపై ముమైత్ చాలా హ్యాపీగా ఉందట. మళ్లీ తన టాలెంట్ ఏమిటో చూపిస్తానని చెబుతోందట.

తాజాగా ఆమె చేస్తున్న ఐటం సాంగు విషయానికొస్తే...ఇందులో శింబు తండ్రి టి. రాజేందర్ కూడా ఆమెతో కలిసి స్టెప్పులేయబోతున్నారట. ఆయనతో కలిసి డాన్స్ చేయడంపై ముమైత్ ఖాన్ ఆసక్తిగానే ఉన్నా, కష్టంగా ఫీలయిందట. అదేమిటనేనది స్లైడ్ షోలో...

టి రాజేందర్ తో కలిసి స్టెప్పులేసేప్పుడు ముమైత్ ఖాన్ అనేక రీటేకులు తీసుకోవాల్సి వచ్చిందట. అందుకే ఇబ్బందిగా ఫీలైంది.

అయితే టి రాజేందర్‌తో కలిసి ఐటం సాంగులో స్టెప్పులేయడంపై గ్రేట్, చాలెజింగ్ ఎక్స్‌పీరియన్స్ అని అంటోంది ముమైత్ ఖాన్

చాలా రోజుల తర్వాత ఐటం సాంగు చేస్తుండటంతో వీలైనంత పొదుపుగా దుస్తులేసి అందాల విశ్వరూపం చూపిందట ముమైత్ ఖాన్.


ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే...ఈ పాటను రాయడం, కంపోజ్ చేయడంతో పాటు ఈ పాట కోసం గొంతు కూడా కలిపారు టి. రాజేందర్.

మాస్ ప్రేక్షకులను ఊర్రూతలూగించే విధంగా ఈ పాట ఉంటుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

ఈ మధ్య కొత్త ఐటం భామల రాకతోనే ముమైత్ ఖాన్ ఐటం నంబర్లకు డిమాండ్ తగ్గిందని, ఈ పాట హిట్టయితే ఆమెకు సౌత్ లో అవకాశాలు వెల్లువెత్తుతాయని అంటున్నారు.

English summary
Glamorous item girl Mumaith Khan was not seen much in Tamil films in the recent times. Her Kollywood fans have been craving to see her hot numbers and it was believed that the actress would not return soon, as she was not doing special numbers in her stronghold - Telugu film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu