»   »  లేటెస్ట్ ఫొటోలు 'సర్దార్‌' సెట్స్ : పవన్‌ కళ్యాణ్ ఫుల్ ఫిట్

లేటెస్ట్ ఫొటోలు 'సర్దార్‌' సెట్స్ : పవన్‌ కళ్యాణ్ ఫుల్ ఫిట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఫైట్స్ సీన్స్ తో ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ సెట్ లోని కొన్ని ఫొటోలు బయిటకు వచ్చాయి. ఈ ఫొటోల్లో పవన్ కళ్యాణ్ చాలా ఫిట్ గా ఉండటం గమనించవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పవన్ ..పోలీస్ పాత్ర చేస్తున్న ఓ పొడుగాటి వ్యక్తితోనూ, ఓ బాడీ బిల్డర్ తోనూ కారవాన్ ప్రక్కన నిలబడి తీయించుకున్న ఫొటోలు. ఈ ఫోటోలలో వాళ్లు పవన్ తో ఫొటో దిగుతున్నామన్న ఆనందం కళ్లలో కనపడుతోంది మీరు గమనిస్తే.

ఇక కంటిన్యూగా జరుగుతున్న ఈ షెడ్యూల్ కు కొనసాగింపుగా నైట్ షూట్ ప్లాన్ చేసారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రాత్రిపూట ఈ షూటింగ్ జరగనుంది. పవన్ కళ్యాణ్ రెగ్యులర్ షూట్ లో పాల్గొననున్నారు. ఈ సీన్స్ తర్వాత గుజరాత్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.

ఈ చిత్రాన్ని విలేజ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్టు బాధ్యతలు పవన్ కళ్యాణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. తనకు నచ్చిన విధంగా చేర్పులు, మార్పులు చేయించారు.

స్లైడ్ షోలో షూటింగ్ సెట్లోని ఫొటోలు

బిజీగా..

బిజీగా..


ఈ చిత్రం షూటింగ్‌లో పవన్‌ బిజీగా గడుపుతున్నారు.

పోలీస్ గా..

పోలీస్ గా..

ఈ చిత్రంలోనూ పవన్ పోలీస్ గా అదరకొట్టనున్నారు.

ఫిట్

ఫిట్


పోలీస్ పాత్రలో ఫిట్ గా ఉండేందుకు సరపడ పవన్ జిమ్ కు వెళ్లి మరీ రెడీ అయ్యారు.

తుపాకులతో

తుపాకులతో


విలన్ డెన్ మరోదో...మొత్తానికి ఏదో తీవ్రవాద వ్యవహాంలాగ ఉంది

పవర్ ఫుల్ గా..

పవర్ ఫుల్ గా..


నెగిటవ్ పాత్రలను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

అదిరే డైలాగులు

అదిరే డైలాగులు


దర్శకుడు బాబి..తనదైన శైలిలో అదిరే పంచ్ లతో డైలాగులు రాసాడంటున్నారు

స్టార్ డైరక్టర్

స్టార్ డైరక్టర్


దర్శకుడు బాబి ఈ చిత్రం ఆఫర్ తో స్టార్ డైరక్టర్ గా మారిపోయారు

సూపర్ రెస్పాన్స్..

సూపర్ రెస్పాన్స్..

ఇప్పటికే విడుదల చేసిన 'సర్దార్‌' ఫస్ట్‌లుక్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చిందీ.

ప్రభంజనం

ప్రభంజనం

పవన్‌ కల్యాణ్‌ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్‌ సింగ్‌'లో చూశాం. ఇప్పుడూ అలాంటి ప్రభంజనం వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

అదరకొడతారు

అదరకొడతారు


'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారంలోనూ అదరకొడతారు. మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు.

మిత్రుడే నిర్మాత

మిత్రుడే నిర్మాతఈ చిత్రాన్ని పవన్ మిత్రుడు శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 పేరు మార్పు

పేరు మార్పు


ఇంతవరకూ ఈ ప్రాజెక్టు 'గబ్బర్‌సింగ్‌ 2' పేరు మీదే చలామణీ అవుతోంది. ఈ చిత్రానికి ఇప్పుడు సరికొత్త పేరు పెట్టి షూటింగ్ మొదలెట్టారు.

పాల్గొనలేదు..

పాల్గొనలేదు..

సినిమా చాలా కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా తొలిషెడ్యూల్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగులో పాల్గొనలేదు.

సెకండ్ షెడ్యూల్

సెకండ్ షెడ్యూల్

సెకండ్ షెడ్యూల్ సైతం ఆలస్యం అవుతూనే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జులై 29 హైదరాబాద్ లో ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగులో జాయిన్ అయ్యారు.

టెక్నికల్ డిటేల్స్

టెక్నికల్ డిటేల్స్

ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. జైనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ ‘నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్' బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Few more pics from Pawan Kalyan's "Sardar" sets were leaked. "Sardar" is touted to be a power-packed action drama, which is directed by "Power" fame Bobby and produced by Pawan close friend Sarath Marrar under his banner Northstar Entertainment. Kajal Agarwal is playing the female lead in the film, which will have Devi Sri Prasad's music.
    Please Wait while comments are loading...