»   » పవన్ కళ్యాణ్ లండన్ టూర్, ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా... (ఫొటోలు)

పవన్ కళ్యాణ్ లండన్ టూర్, ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా... (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నేడు లండన్ కి ఎర్లీ మార్నింగ్ బయిలుదేరారు. నెల రోజులుగా జరుగుతున్న జయతే కూచిపూడి ఫెస్టివల్ క్లోజింగ్ సెర్మనికు ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్బంగా ఆయన ఈ రోజు ఉదయం ఎయిర్ పోర్ట్ లో కనపడినప్పుడు తీసిన కొన్ని ఫొటోలు మీ ముందు ఉంచుతున్నాం.

ఆయన అక్కడ లాండ్ అయ్యాక... యూకేలో జరిగే తెలుగు అసోసియేషన్ 6వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనున్నారు యూకే తెలుగు అసోసియేషన్ పిలుపు మేరకు ఆయన హజరవుతున్నారు. దాంతో యూకేలో పవన్‌కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

'యుక్తా'కు చెందిన గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది.

ఈస్ట్ లండన్ లోని యూకేలోని ట్రాక్సీలో 9వ తేది సాయింత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. తెలుగు జాతిపై అభిమానంతో ఈ కార్యక్రమానికి పవన్ కాళ్యాణ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్తున్నారు.

స్లైడ్ షోలో ఫొటోలు చూడండి...

అభిమానులతోనూ..

అభిమానులతోనూ..

యూకే, యూరప్ లోని తన అభిమానులు ఏర్పాటు చేయనున్న ముఖాముఖి కార్యక్రమంలోనూ భాగస్వామ్యులు కానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. లండన్ అభిమానులంతా ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు.

ఏం మాట్లాడతారు..

ఏం మాట్లాడతారు..

అయితే ఈ అభిమానుల సమావేశంలో ఆయనేం మాట్లాడనున్నారు అనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంసంగా మారింది.

పొలిటకల్ వ్యూస్

పొలిటకల్ వ్యూస్

పొలిటికల్ వ్యూస్ మాట్లాడతారా లేక సినిమాలు గురించి చర్చిస్తూ క్యాజువల్ గా మీట్ అవుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

అయితే..

అయితే..

తమ జనసేన పార్టీ బలోపేతం చేయటానికి అక్కడనుంచి కూడా సపోర్ట్ తీసుకునేందుకే పవన్ వారిని కలుస్తున్నారని మీడియాలో కథనాలు వెలువడటం విశేషం.

ముఖ్య అతిధిగా

ముఖ్య అతిధిగా

యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేష్ (యుక్తా) ఆధ్వర్యంలో జరుగుతున్న "జయతే కూచిపూడి" ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఎన్నారైలు

ఎన్నారైలు

దాదాపు 2000 మంది ఎన్ఆర్ఐ కుటుంబాలు పాల్గొనబోతున్న ఈ కార్యక్రమంలో పవన్ చేత కూచిపూడి కళాకారులను సన్మానించనున్నారు.

అట్టహాసంగా

అట్టహాసంగా

మొట్టమొదటి సారిగా ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొననుండడంతో వేడుకను అట్టహాసంగా నిర్వహించబోతున్నారు.

ప్రచారం

ప్రచారం

సాధారణంగా...ప్రైవేటు కార్యక్రమాలకు చాలా అరుదుగా హాజరయ్యే పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ లో పాల్గొనటంతో దానికి ఎక్కడలేని ప్రచారం లభిస్తోంది.

ఫుల్ హ్యాపీ

ఫుల్ హ్యాపీ

ఈ అరుదైన అవకాశమే 'యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం' వారికి దక్కటంతో వారు చాలా హ్యాపీగా ఉన్నారు.

అలాగే...

అలాగే...

పవన్ రంగ ప్రవేశం చేయనున్నారన్న వార్తతో ఈ కార్యక్రమానికి మునుపెన్నడూ లేనంత భారీ ప్రచారం కూడా జరుగుతోంది.

తెలుగు మీడియాలోనూ

తెలుగు మీడియాలోనూ

ఈ టూర్ విషయమై తెలుగు మీడియా కూడా అత్యధిక ప్రయారిటీ ఇస్తోంది.

పొలిటికల్ వర్గాల్లోనూ

పొలిటికల్ వర్గాల్లోనూ

ఈ విషయమై పొలిటికల్ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. ఎందుకు పవన్ వెళ్తున్నారనేది వారిలో ఆసక్తి రేపుతోంది

వచ్చాక పూర్తి గా సినిమా

వచ్చాక పూర్తి గా సినిమా

ఈ టూర్ నుంచి వచ్చాక పవన్ పూర్తిగా సినిమా విషయంలో నిమగ్నమవనున్నారు.

English summary
Pawan Kalyan flew to London early today to attend the closing ceremony of Jayate Kuchipudi festival, which is happening since a month. The actor was spotted in Hyderabad airport in the early hours on 8 July, where he obliged to click a few pictures with his fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu