twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటోలు : తెలుగు వారియర్స్ సిసిఎల్-3 కర్టెన్ రైజర్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : సెలబ్రిటీ క్రికెట్ లీగర్ 3వ సీజన్‌కు సంబంధించి కర్టెన్ రైజర్(జట్ల పరిచయ వేదిక) కార్యక్రమం ముంబైలోని రియలన్స్ స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని హిందీ, తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, బోజ్ పురి చిత్ర పరిశ్రమలకు చెందిన వందలాది మంది సినీ తారలు హాజరై సందడి చేసారు. తెలుగు వారియర్స్ కెప్టెన్ వెంకటేష్ తన జట్టుతో కలిసి ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు.

    ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు రితేష్ దేష్ ముఖ్, ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, బిపాసా బసు ఇచ్చిన మిరిమిట్లు గొలిపే ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేష్ తెలుగు వారియర్స్ జట్టుకు సంబంధించిన ప్లేయర్ల పేర్లను ప్రకటించారు.

    ఫోటోలు : తెలుగు వారియర్స్ @ సిసిఎల్-3 కర్టెన్ రైజర్

    తెలుగు వారియర్స్ టీం : వెంకటేష్, రామ్ చరణ్ తేజ్, తరుణ్, శ్రీకాంత్, నితిన్, ఆదర్శ్, తారక్, అజయ్, సామ్రాట్, ఖయ్యుం, రాజీవ్ కనకాల, రఘు, ప్రభు, అయ్యప్ప, విశ్వ, నందకిషోర్ తదితరులు

    ఫోటోలు : తెలుగు వారియర్స్ @ సిసిఎల్-3 కర్టెన్ రైజర్

    వెంకటేష్, శ్రీకాంత్, తరుణ్ లతో కర్టెన్ రైజర్ కార్యక్రమంలో చార్మి

    ఫోటోలు : తెలుగు వారియర్స్ @ సిసిఎల్-3 కర్టెన్ రైజర్

    సిసిఎల్ 3 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రెట్ కార్పెట్ పై నడుస్తున్న వెంకటేష్, రాణా

    ఫోటోలు : తెలుగు వారియర్స్ @ సిసిఎల్-3 కర్టెన్ రైజర్

    సిసిఎల్ 3 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రెట్ కార్పెట్ పై నడుస్తున్న కాజల్, చార్మి

    ఫోటోలు : తెలుగు వారియర్స్ @ సిసిఎల్-3 కర్టెన్ రైజర్

    సిసిఎల్ 3 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రెట్ కార్పెట్ పై నడుస్తున్న లక్ష్మీ రాయ్, జెనీలియా

    ఫోటోలు : తెలుగు వారియర్స్ @ సిసిఎల్-3 కర్టెన్ రైజర్

    సిసిఎల్ 3 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రెట్ కార్పెట్ పై నడుస్తున్న శృతి హాసన్, సంజన

    ఫోటోలు : తెలుగు వారియర్స్ @ సిసిఎల్-3 కర్టెన్ రైజర్

    సిసిఎల్ 3 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రెట్ కార్పెట్ పై నడుస్తున్న ప్రణీత, రాగిని

    గత సంవత్సరం వరకు తెలుగు, తమిళం, కేరళ, కర్నాటక, హిందీ ఇలా 5 పరిశ్రమలకు చెందిన ఐదు టీంలు మాత్రమే ఉండేవి. అయితే ఈ సంవత్సరం నుంచి మరో రెండు టీంను అదనంగా చేరబోతున్నాయి. ఈ సంవత్సరం మరాఠీ, బోజ్ పురి టీంలు కూడా జాయిన్ కాబోతున్నారు.

    ఫిబ్రవరి 9 నుంచి CCL-3 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని కోచ్చిలో జరుగనుంది. దేశంలోని వివిధ నగరాల్లో మ్యాచ్ లు జరుగనున్నాయి. త్వరలో అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. కర్టెన్ రైజర్ కార్యక్రమంలో తెలుగు వారియర్స్ సభ్యుల సందడి, హీరోయిన్ల అందాల తళుకుబెలుకు స్లైడ్ షోలో వీక్షించండి.

    English summary
    
 Hyderabad: The curtain-raiser of the third edition of Celebrity Cricket League (CCL 3) held at the Reliance Studios, Goregaon Filmcity in Mumbai. It was star-studded, which witnessed the presence of hundreds of stars from eight big Indian film industries like Hindi, Telugu, Tamil, Malayalam, Kannada, Bengali, Marathi and Bhojpuri. Along with his teammates, Telugu Warriors' captain Venkatesh was oozing with joy on the occasion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X