»   » ఫన్ గా.. త్రిష పుట్టిన రోజు పార్టీ (ఫొటోలు-వీడియో), ఎవరెవరు విష్ చేసారు?

ఫన్ గా.. త్రిష పుట్టిన రోజు పార్టీ (ఫొటోలు-వీడియో), ఎవరెవరు విష్ చేసారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: త్రిష ఎప్పటిలాగే ఈ పుట్టిన రోజుని కూడా ఉషారుగా తన కుటుంబ సభ్యులు, తన సన్నిహితుల మధ్య జరుపుకుంది. ఇది త్రిషకు 32 వ పుట్టిన రోజు. త్రిష పుట్టిన రోజుని పురస్కరించుకుని ఎంతో మంది అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆమెకు శుబాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఆమె కేకు కట్ చేసిన వీడియోని మీరు ఇక్కడ చూడండి.

  My "not so surprised" party😂 #myfamily #myfriends #myworld #drownedinlove

  A video posted by Trisha (@dudette583) on May 3, 2016 at 6:17pm PDT

  ఈ పదిహారేళ్ళ కెరీర్లో త్రిష తెలుగు, తమిళ భాషల్లో మంచి చిత్రాలు ఎన్నో చేసింది. అయితే ఇప్పుడు ఆచి తూచి ఆడుగులు వేస్తోంది. సరైన స్క్రిప్టు అయితేనే ఓకే చేస్తోంది. డీసెంట్ ఆఫర్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. 2015 సంవత్సరం ఆమె చేసిన సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. ఈ సంవత్సరం మాత్రం ఆమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం నాయకి రిలీజ్ అవుతోంది.

  ఈ సంవత్సరం తన అభిమానులుకు ఆమె ఓ సర్పైజ్ ఇచ్చింది. ఆమె గాయనిగా అవతారం ఎత్తింది. ఆమె పాడిన పాట విని చాలా మంది ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ఈ వీడియో, ఫొటోలు చూస్తూంటే త్రిష చాలా ఉత్సాహంగా పుట్టిన రోజుని జరుపుకున్నట్లు అనిపిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

  గత కొంత కాలంగా యంగ్ హీరోయిన్స్ తో పోటీపడలేక త్రిష కెరీర్ కాస్తంత డల్ అయ్యింది. హిందీలో నటించిన 'కట్టా మీఠా' కూడా పరాజయం పాలైంది. అయితే... గౌతమ్ వాసుదేవ మీనన్ 'వినైతాండి వరువాయ్'తో మళ్ళీ త్రిషను ఫామ్ లోకి తీసుకొచ్చాడు. ఇక అక్కడ నుండి అమ్మడి కెరీర్ కాస్తంత కుదురుకుంది.

  బర్తేడే పార్టీ ఫొటోలు...

  తొలి చిత్రం , నటిగా

  తొలి చిత్రం , నటిగా

  1999'లో జోడీ చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసి గుర్తింపు తెచ్చుకున్న త్రిష కు నటిగా మార్కులు తెచ్చిపెట్టన చిత్రం 'మౌనం పేసియాదే'.

  తెలుగులో ఎంట్రీ

  తెలుగులో ఎంట్రీ

  తెలుగులో 'నీ మనసు నాకు తెలుసు'తో ఎంట్రీ ఇచ్చింది.

  బ్రేక్ ఇచ్చిన చిత్రం

  బ్రేక్ ఇచ్చిన చిత్రం

  త్రిషకు స్టార్ హీరోయిన్ స్టేటస్ కట్టబెట్టిన సినిమా 'వర్షం'.

  సూపర్ హిట్

  సూపర్ హిట్


  ఆ తర్వాత వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' కూడా ఆమెకు సూపర్ హిట్ ను అందించింది.

  తొలిసారి వెంకటేష్ తో

  తొలిసారి వెంకటేష్ తో

  ఇక వెంకటేశ్ సరసన త్రిష తొలిసారి నటించిన సినిమా 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'. విశేషం ఏమంటే... ఈ మూడు చిత్రాలు ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందించాయి.

  లవ్ స్టోరీ ముగిసింది

  లవ్ స్టోరీ ముగిసింది

  ఇప్పుడిప్పుడే కొత్త అవకాశాలు వస్తున్నాయ్. అయితే త్వరలోనే త్రిష పెళ్ళి పీటలు ఎక్కబోతోంది అనుకున్నారు. అయితే అర్దాంతరంగా ఆ లవ్ స్టోరీ ముగిసిపోయింది.

  కొత్త సినిమాలుకు సై

  కొత్త సినిమాలుకు సై

  దాంతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టనని కొత్త సినిమాలకు సైన్ చేస్తూ త్రిష చెప్పకనే చెబుతోంది. ఈ సంవత్సరం కూడా ఈ చెన్నయ్ చంద్రం కెరీర్ దేదీప్యమానంగా వెలిగిపోవాలని బర్త్ డే సందర్భంగా కోరుకుందాం.

  ఆర్యకు ధాంక్స్ చెప్తూ..

  పుట్టిన రోజు విషెష్ చెప్పిన ఆర్యకు ఇలా ..

  రాధిక విషెష్

  రాధికా శరత్ కుమార్ ..విషెష్ చెప్తే దానికి రెస్పాన్స్ గా..

  సమంత

  సమంత ..పుట్టిన రోజు విషెష్ చెప్తే...ధాంక్స్ చెప్తూ..

  హీరో సిద్దార్ద

  తనతో కెరీర్ ప్రారంభంలో చిత్రాలు చేసిన సిద్దార్ద విష్ చేస్తే రిప్లై ఇస్తూ..

  జయం రవి

  తమిళ హీరో జయం రవి చెప్పిన విషెష్ కు రిప్లై గా..

  తాప్సీ

  స్టార్ హీరో తాప్సీ...చెప్పిన విషెష్ కు రిప్లై ఇస్తూ...

  ప్రేమ్ జీ

  తమిళ కమిడయన్ ..ప్రేమ్ జీ చెప్పిన విషెష్ కు రిప్లై ఇస్తూ..

  చిన్మయి

  డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి చెప్పిన విషెష్ కు రిప్లై ఇస్తూ..

  హన్సిక

  తోటి హీరోయిన్ హన్సిక చెప్పిన విషెష్ కు రిప్లై ఇస్తూ..

  దర్శకుడు పూరి

  పూరి జగన్, త్రిష కాంబినేషన్ లో బుజ్జి గాడు మేడిన్ చెన్నై చిత్రం వచ్చింది. ఆ అనుభంధంతో ఇలా..

  ఛార్మి

  తెలుగు హీరోయిన్ ఛార్మికి, త్రిషకు మంచి అనుబంధం ఉంది .

  వరలక్ష్మి శరత్ కుమార్

  శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి చెప్పిన విషెష్ కు రిప్లై ఇస్తూ..

  English summary
  Trisha Krishnan is celebrating her 32nd birthday today and her gang of friends surprised her last night with a birthday party and Trisha called it a 'not so surprised' birthday party, since this has been an usual thing from years now.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more