»   » ఈ లుక్కేంటి తారక్: సుకుమార్ కొత్త సినిమా కోసమేనా?

ఈ లుక్కేంటి తారక్: సుకుమార్ కొత్త సినిమా కోసమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఇటీవల తన ఆఫీసులో భారీగా గడ్డం పెంచేసి సరికొత్త లుక్ లో కనిపించాడు. ఇటీవల తన అభిమానితో కలిసి ఫోటోకు ఫోజు ఇచ్చిన సందర్భంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఈ లుక్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ఎందుకు ఇంత భారీగా గడ్డం పెంచాడు అనేది హాట్ టాపిక్ అయింది.

త్వరలో ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న నేపథ్యంలో....టాప్ క్లాస్ స్టైలిస్ట్ లతో సరికొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయబోతున్నాడని, అందుకే ఇంత భారీగా జుట్టు, గడ్డాలు, మీసాలు పెంచాడని టాక్. మేకోవర్ తర్వాత ఎన్టీఆర్ అదిరిపోయే లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు.

PIC TALK: Jr NTR's New Look For Sukumar's Film

ఎన్.టి.ఆర్, సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందనున్న ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభంకానుంన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంభందించి అందుతున్న తాజా సమాచారం ప్రకారం సుకుమార్ మరియు సంగీత దర్శకుడు దేవి తన బృందంతో కలిసి స్పెయిన్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కి వెళ్ళారు. ఈ సినిమాకి ట్యూస్స్ సమకూర్చే పనిలో ఏప్రిల్ 9వరకూ అక్కడే గడపనున్నారు.

అలాగే ఈ సినిమాకు ‘దండయాత్ర' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రకు జగపతిబాబుని ఎంపిక చేసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

English summary
Jr NTR was spotted sporting a new look at his office. A recent Picture of NTR posing with his fan, has been making rounds in the internet and his new avatar in the picture is being talked about everyone.
Please Wait while comments are loading...