»   » పిక్చర్: ఒకే ఫ్లయిట్‌లో అమితాబ్, రేఖ ఇలా..

పిక్చర్: ఒకే ఫ్లయిట్‌లో అమితాబ్, రేఖ ఇలా..

Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ప్రముఖ నటి రేఖలు కలిసి ఇటీవల ఓ విమానంలో ప్రయాణించారు. ఆ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలో రేఖ కూర్చున్న ముందు సీటులో అమితాబ్ బచ్చన్ కూర్చున్నారు. అయితే ఈ చిత్రం.. విమానంలోని ఓ పైలట్ తన అభిమాన నటుడు అమితాబ్‌తో ఫొటో దిగడంతో బయటికి వచ్చింది. అమితాబ్‌తో దిగిన ఈ ఫొటోలో అమితాబ్ వెనక సీట్లో రేఖ కనిపిస్తోంది.

1980లలో అమితాబ్, రేఖలు కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. వారిది హిట్ పేర్‌గా అభిమానులేగాక చిత్ర పరిశ్రమ వర్గాలు ప్రకటించేశాయి. ఆ సమయంలో వారిద్దరి సంబంధాలపై అనేక రూమర్లూ వచ్చాయి. వారి ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్ కెమిస్ట్రీపై ఎన్నో వదంతులూ వచ్చాయి. దీంతో వారిద్దరూ వ్యక్తిగత జీవితాలను వేర్వేరుగా గడుపుతున్నారు. అయితే పార్టీలు, అవార్డుల వేడుకల సమయాల్లో రేఖ, అమితాబ్‌లు కలుసుకుంటూనే ఉన్నారు.

రేఖ, అమితాబ్‌లు తొలిసారిగా 'దో అంజానే' సినిమాలో నాయికానాయకులుగా నటించారు. ఆన్‌స్క్రీన్‌లో వారిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుటవడంతో తమ తదుపరి చిత్రాల్లో నిర్మాతలు, దర్శకులుగా వారినే హీరో, హీరోయిన్లుగా ఎంచుకున్నారు. కూన్ పాసిన, సుహాగ్, ముఖద్దర్ కా సికెందర్, మిస్టర్ నట్వర్లాల్ మొదలగు సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ అమితాబ్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. 1984లో యాశ్ చోప్రా రూపొందించిన రోమాంటిక్ చిత్రం 'సిల్‌సిల'లో అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ (నిజ జీవితంలో అమితాబ్ భార్య), రేఖ నటించారు. ఈ సినిమాలో వారి పాత్రలు నిజజీవితానికి దగ్గరగా ఉండడం విశేషం.

కాగా బిగ్ బి అమితాబ్ ఇప్పటికీ ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో వస్తే రేఖ‌తో నటించడానికి తాను సిద్ధమని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే త్వరలోనే బాలీవుడ్ హిట్ పేర్ అమితాబ్, రేఖలను అభిమానులు తెరపై తిలకించే అవకాశం దక్కనుందని చెప్పుకోవచ్చు.

English summary
Amitabh Bachchan and Rekha were recently spotted in a flight together and the picture is doing the rounds in the internet. While Amitabh Bachchan was sitting in the front, Rekha was spotted sitting and relaxing right behind. The two haven't been spotted together for a long time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu