»   » వెయిటింగులో టాప్-20 తెలుగు సినిమాలు (పిక్చర్స్)

వెయిటింగులో టాప్-20 తెలుగు సినిమాలు (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2014 సంవత్సరంలో గడిచిన నాలుగున్నర నెలల్లో తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఇప్పటికే 50కి పైగా సినిమాలు విడుదలయ్యాయి. రాబోయే 7 నెలల్లో పరిశ్రమ నుండి దాదాపు 75 సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మనం, ఆగడు, గోవిందుడు అందరి వాడేలే, రభస, పవర్, రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఇందులో ఉన్నాయి.

ఈ సంవత్సరం విడుదలకు సిద్ధంగా ఉన్న మిగిలిన సినిమాల్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల వివరాలను ఈ రోజు ఫోటో ఫీచర్లో తెలుసుకుందాం. ఇందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఉన్నాయి.

సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు స్లైడ్ షోలో.....

మనం

మనం

అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన మల్టీస్టారర్ మూవీ ‘మనం'. నాగేశ్వరావు, నాగార్జున, నాగ చైత్య ఈ చిత్రంలో నిజజీవిత పాత్రలు పోషిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 23వ తేదీన విడుదలవుతోంది. అక్కినేని నటించిన చివరి సినిమా కావడంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆగడు

ఆగడు

మహేష్ బాబు, శ్రీను వైట్ల కలిసి చేస్తున్న రెండో సినిమా ‘ఆగడు'. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ‘దూకుడు'అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో ఈచిత్రంపై భారీ అంచనాలున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్.

గోవిందుడు అందరి వాడేలే

గోవిందుడు అందరి వాడేలే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే'. ఈ మధ్య వరుస మాస్ సినిమాలు చేసిన రామ్ చరణ్ కృష్ణ వంశీ దర్శకత్వంలో ఫ్యామిలీ మూడీ చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

రభస

రభస

జూ ఎన్టీఆర్ హీరోగా సమంత, ప్రణీత హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘రభస'. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నరు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవర్

పవర్

ఈ మధ్య రవితేజ మార్కు సినిమాలు చూసి చాలా రోజులైంది. ఆయన నటించిన ‘బలుపు' చిత్రం గతేడాది విడుదలై మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘పవర్' చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక, రెజీనా హీరోయిన్లు.

రుద్రమదేవి

రుద్రమదేవి

అనుష్క హీరోయిన్‌గా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక నేపథ్యం ఉన్న భారీ బడ్జెట్ మూవీ ‘రుద్రమదేవి'. రూ. 50 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌‍తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను చాలా రిచ్‌గా తీస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈచిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘గబ్బర్ సింగ్-2' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.

జెండాపై కపిరాజు

జెండాపై కపిరాజు

నాని, అమలా పాల్ ప్రధాన పాత్రల్లో సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెండాపై కపిరాజు'. ఈ చిత్రంలో నాని డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రేయ్

రేయ్

వైవిఎస్ చౌదరి దర్శకుడిగా మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘రేయ్'. ఈచిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

ఆటో నగర్ సూర్య

ఆటో నగర్ సూర్య

నాగ చైతన్య హీరోగా దేవా కట్ట దర్శకత్వంలో తరకెక్కిన చిత్రం ‘ఆటో నగర్ సూర్య'. ‘ఏమాయ చేసావె' చిత్రంలో జోడీగా నటించిన నాగ చైతన్య-సమంత ఈచిత్రంలో రొమాన్స్ చేస్తుండటంతో ఈచిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అనూపర్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

పండగ చేస్కో

పండగ చేస్కో

మస్కా, కందిరీగ చిత్రాల్లో జోడీగా నటించిన రామ్, హన్సిక కలిసి చేస్తున్న మరో చిత్రం ‘పండగ చేస్కో'. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూనైటైడ్ మూవీస్ పతాకంపై పరుచూరి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గొల్లభామ

గొల్లభామ

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న మరో హీరో, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభం అయింది. పూజా హెడ్గే హీరోయిన్. నాగబాబు తనయుడి సినిమా కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

విక్రమ సింహ

విక్రమ సింహ

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘కొచ్చాడయాన్' తెలుగులో ‘విక్రమ సింహా' పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. దీపిక పదుకోన్ హీరోయిన్. మోషన్ కాప్చర్స్ టెక్నాలజీ ఉపయోగించి తెరకెక్కించిన తొలి సినిమా. ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతోంది.

దేవ దేవం భజే..

దేవ దేవం భజే..

హిందీలో హిట్టయిన ‘ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో ‘దేవ దేవం భజే' పేరుతో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

పటాస్

పటాస్

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కతున్న మరో చిత్రం ‘పటాస్'. ఇటీవల ఈ చిత్రం జూ ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ఈచిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

కొరియర్ బాయ్ కళ్యాణ్

కొరియర్ బాయ్ కళ్యాణ్

నితిన్ హీరోగా ప్రేమ్ సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్'. యామీ గౌతం హీరోయిన్. గౌతం మీనన్ నిర్మిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

కార్తికేయ

కార్తికేయ

హీరో నిఖిల్ సిద్ధార్థ్, స్వాతి జంటగా తెరకెక్కుతున్న మరో చిత్రం ‘కార్తికేయ'. థ్రిల్లర్ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

జంప్ జిలానీ

జంప్ జిలానీ

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘జంప్ జిలానీ'. సత్తి బాబు దర్శకుడు. ఇషా చావ్లా హీరోయిన్. ఈ కామెడీ ఎంటర్టెనర్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

పట్టపగలు

పట్టపగలు

రామ్ గోపాల్ వర్మ తీసే హారర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘పట్టపగలు' చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈచిత్రంలో రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

రా..రా..కృష్ణయ్య

రా..రా..కృష్ణయ్య

సందీప్ కిషన్, రెజీనా జంటగా తెరకెక్కుతున్న రా..రా..కృష్ణయ్య సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

English summary
Telugu film industry has already released more than 50 movies in four and half months in 2014. There are more 75 Tollywood films lined up to release in theatres in the next seven months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu