»   » ఫోటోలు : అనుష్క టాప్ 5 యాక్షన్ ఫిల్మ్స్

ఫోటోలు : అనుష్క టాప్ 5 యాక్షన్ ఫిల్మ్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలు కేవలం అందాల ఆరబోతకు, హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ వీరందరికీ భిన్నంగా రాణిస్తోంది హాట్ అండ్ సెక్సీ తార అనుష్క. ఇటు గ్లామర్ పాత్రలతో పాటు ఇటు భారీ యాక్షన్ పాత్రలకు ఆమెను మించిన ఆప్షన్ తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు దొరకడం లేదు.

ఇప్పటికే అరుంధతి సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో తన సత్తా చాటిన అనుష్క, బిల్లా చిత్రంలోనూ పాత్రకు తగిన విధంగా తన మార్కు పెర్ఫార్మెన్స్ చూపెట్టింది. త్వరలో మరో మూడు భారీ యాక్షన్ చిత్రాల్లో వెండి తెరపై తన తడాకా చూపెట్టబోతోంది ఈ కన్నడ కస్తూరి.

ప్రస్తుతం అనుష్క రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాహుబలి' చిత్రంతో పాటు, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి', తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ద్శకత్వంలో చేస్తున్న 'వర్ణ' చిత్రంలో నటిస్తోంది.

అరుంధతి

అరుంధతి

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి' చిత్రంలో టైటిల్ రోల్ చేసిన అనుష్క ఈ చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్ గా అవతరించింది. సినిమా సబ్జెక్టుకు తోడు అనుష్క అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో విలన్ సోనూ సూద్ తో అనుష్క చేసిన కత్రియుద్ధం సన్నివేశాలు అదుర్స్ అనేలా ఉన్నాయి.

బిల్లా

బిల్లా

ప్రభాస్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో 2009లో రూపొందిన ‘బిల్లా' చిత్రంలో అనుష్క పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఇందులో అనుష్క చేసిన గన్ ఫైటింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

రుద్రమదేవి

రుద్రమదేవి

ప్రస్తుతం అనుష్క గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక మూవీ ‘అరుంధతి' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో కాకతీయ వీరనారి రుద్రమదేవి పాత్రలో ఆమె నటిస్తోంది. ఈచిత్రంలో అనుష్క కత్తి యుద్ధం సన్నివేశాలు, యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.

వర్ణ

వర్ణ

ఆర్య-అనుష్క జంటగా తమిళ దర్శకుడు సెల్వరాఘన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘ఇరండమ్ ఉలగమ్' చిత్రం తెలుగులో ‘వర్ణ' పేరుతో విడుదల కాబోతోంది. ఈచిత్రంలో అనూష్క భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుందట.

బాహుబలి

బాహుబలి

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మరో భారీ చిత్రం ‘బాహుబలి'. ప్రభాస్ హీరోగా రూపొందుతునప్న ఈచిత్రంలో అనుష్క హీరోయిన్. కత్రి యుద్ధాలు, మల్ల యుద్ధాలు, గుర్రపు స్వారీ లాంటి భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అనుష్క చేసే సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయట.

English summary
Actresses are mainly used for glam quotient in Telugu film industry and they have nothing much to do other sizzling with heroes in the romantic scenes. Not many will get to do action in Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu