twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫొటో పీచర్:2012 టాప్ 10 వివాదాస్పద తెలుగు చిత్రాలు

    By Srikanya
    |

    హైదరాబాద్: 2012 సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో కన్నా ఎక్కువ హిట్ సినిమాలు వచ్చాయి,అలాగే అదే రేంజిలో వివాదాస్పద చిత్రాలు పెరిగాయి. ప్రేక్షకుల్లో పెరుగుతున్న అవగాహన, మీడియా తోర్పాటు,కొన్నిసార్లు సినీ దర్శక,నిర్మాతల నిర్లక్ష్య వైఖరి ఈ వివాదలకు కారణమవుతున్నాయి. ఓ వర్గాన్నో,ప్రాతాన్నో,కులాన్నో,మతాన్నో తమ చిత్రాల్లో కావాలనో,కలిసివస్తుందనో,పొరపాటునో మనోభావాలు దెబ్బతినేలా ప్రెజెంట్ చేయటం వల్ల విమర్శలు,సమస్యలు వస్తున్నాయి. వివాదం తాత్కాలికంగా విజయానికి ప్లస్ అయినా లాంగ్ రన్ లో ఆ దర్శకుడు లేదా నిర్మాత లేదా హీరో మనోభావాలు దెబ్బతిన్న వారికి దూరం అయిపోతారు. ఈ నేపధ్యంలో ఈ సంవత్సరం ముగుస్తున్న సమయంలో ఒక్కొసారి ఈ సంవత్సరంలో ఎక్కువ వివాదమైన తెలుగు చిత్రాలును గుర్తు చేసుకుంటే..

    వివాదంతో సినిమాలు ఆడతాయా లేదా అనేది ప్రక్కన పెడితే వివాదాలు మాత్రం పరిశ్రమ అభివృద్దికి శ్రేయస్కరం కాదని తమ్మారెడ్డి భరద్వాజ వంటి పెద్దలు పదే పదే చెప్తున్నారు. ఛీప్ పబ్లిసిటీ కోసం ఏదో ఒక వర్గం సినిమా రిలీజయ్యాక వివాదాలకు దిగటం పట్టించుకోవాల్సిన పనికాదని సురేష్ బాబు లాంటి వాళ్లు విమర్శలు చేసారు. మరో ప్రక్క పోసాని.. వివాదం అనేది కేవలం ఒక్క సినిమా విషయంలోనే ఎందుకు... మిగతా విషయాల్లోనూ చైతన్యం జనాల్లో కొరవడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఏ వర్గాన్ని సినిమా టార్గెట్ చేసి,మనోభావాలు దెబ్బ తీస్తుందో, ఆ వర్గం చైతన్య పూరితంగా తిరగబడి తమ ఆవేదనను ఆందోళన రూపంలో తెలియపరచంలో తప్పులేదని మరికొందరు అంటున్నారు.

    'కెమెరామన్ గంగతో రాంబాబు'

    'కెమెరామన్ గంగతో రాంబాబు' లో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతోపాటు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నైజాంలో ఈ చిత్ర పంపిణీదారు దిల్‌రాజుల కార్యాలయాలపై దాడులు సైతం జరిగాయి. దాంతో ప్రభుత్వం కలగచేసుకుని కమిటీ వేసింది. కమిటీ వారు తెలియచేసిన కట్స్ ని దర్శక,నిర్మాతలు ఓకే చేయటంతో ఈ వివాదం వెంటనే సర్ధుమణిగింది. అయితే ఈ వివాదం సినిమా కలెక్షన్స్ పై మాత్రం ప్రభావం చూపలేకపోయింది.

     'దేనికైనా రెడీ'

    'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారంటూ వివాదం మొదలైంది. ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీ ని వేసింది. సినిమాలో 20 అభ్యంతరకర సన్నివేశాలను ప్రభుత్వం నియమించిన కమిటీ గుర్తించింది. కమిటీని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మోహన్‌బాబు పిటిషన్‌ దాఖలు చేశారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చాక ప్రభుత్వ జోక్యం సరికాదని మోహన్‌బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. మరో ప్రక్క సెన్సార్ సర్ఠిఫికేట్ రద్దు చేయాలంటూ హై కోర్టులో మరోకేసు మొదలైంది.

    డమరుకం

    తాము డమరుకం టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నామని.... అయితే ఆర్ఆర్ మూవీ వారు ‘డ' బదులు ‘ఢ' తగిలించి ‘డమరుకం' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అలా జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని, డమరుకం... ఢమరుకం పెద్ద తేడా ఏముందని యువ దర్శక నిర్మాతలు..ప్రమోద్ కుమార్ గౌడ్,మనోజ్ కుమార్ లు కోర్టుకు వెళ్లారు. ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్ ముందు ఆయన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

    ఫొటో పీచర్:2012 టాప్ 10 వివాదాస్పద తెలుగు చిత్రాలు

    ఈ చిత్రంలో లక్ష కోట్ల అవినీతి అంటూ పోసాని కృష్ణ మురళి డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే అది పరోక్షంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్‌ను ఉద్దేశించి అన్న వ్యాఖ్యలే అనే ప్రచారం సాగుతుండటంతో పోసాని స్పందించారు. అవి జగన్‌ను ఉద్దేశించి అన్న డైలాగ్ కాదని, బళ్లారిలో గనుల అవినీతి పరుడి గురించే అని, ఓబులాపురం గనుల కేసులో గాలి జనార్ధన్ రెడ్డిపై అవినీతి రుజువైంది కాబట్టి.... ఆ డైలాగ్ ఆయనకు వర్తిస్తుందని, జగన్ ను ఉద్దేశించి కాదని స్పష్టం చేసారు.

    ఈ రోజుల్లో

    ఈ రోజుల్లో' ఫేమ్ మారుతి దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం విడడుల రోజే వివాదం అయ్యింది. విద్యార్థులను, యువతను తప్పుదోవ పట్టించేలా బస్‌స్టాప్‌ సినిమాలో సంభాషణలూ, దృశ్యాలూ ఉన్నాయని ఎస్‌ఎఫ్‌ఐ ఆరోపించింది. ఆ సంస్థ నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటరు ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ నేపధ్యంలో సెన్సార్‌ బోర్డు సభ్యురాలు సునీతచౌదరి స్పందిస్తూ... ఇది 'ఎ' సర్టిఫికేట్‌ చిత్రం. యూ, యూబైఎ అని ఇవ్వలేదే. కొందరు కావాలని సినిమాను అడ్డుకుంటున్నారు. ఈ సినిమాను నేనే సెన్సార్‌ చేశాను. పెద్దవారు కూడా చూసి ఆనందపడాలి కదా అని వివరించారు.

    దరువు


    దరువు అనేది 1999 లో విద్యార్ధి కళాకారుల ఆధ్యర్యంలో ఏర్పడిన సంఘం. సామాజిక వివక్షలపై,ప్రాంతీయ వివక్షలపై ఆటై,పాటై ఒక ఉన్నత ఆశయం కోసం పనిచేస్తుందని,దాన్ని వల్గర్ సినిమాకు టైటిల్ గా పెట్టారని,దాన్ని తొలిగించాలని దరువు సంఘం నాయకుడు ఎల్లప్ప డిమాండ్ చేసారు.

    దేవరాయ


    శ్రీకృష్ణ దేవరాయలును కించపరిచేలా చిత్రీకరించిన ‘దేవరాయ' చిత్రంలోని అసభ్యకర దృశ్యాలను వెంటనే తొలగించకపోతే ఆ సినిమా ప్రదర్శనను అడ్డుకోవటమేగాక సెట్‌లను తగులబెడతామని రాష్ట్ర కాపునాడు ఒక ప్రకటనలో హెచ్చరించింది. శ్రీకృష్ణదేవరాయల పాలనను అవహేళన చేస్తే ఊరుకోమని కాపునాడు అధ్యక్షులు నారాయణస్వామి రాయల్ పేర్కొన్నారు.

    రచ్చ

    రచ్చ రిలీజ్ కు ముందే వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్రంలోని పాటలో అసభ్యకరమైనవి ఉన్నాయని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఒక పాటలో గౌతమ బుద్దుని విగ్రహం ముందు అశ్లీల సన్నివేశాలు చిత్రీకరించారని జాతీయ అరుంధతీ మహిళా శక్తి అధ్యక్షురాలు పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ చిత్రంలోని పాటని తొలిగించాలని ఆమె డిమాండ్ చేసారు. చిత్ర దర్శకుడు,నిర్మాత,కొరియోగ్రాఫర్స్ పై చర్చలు తీసుకోవాలని ఆమె కోరారు.

    ఉమెన్ ఇన్ బ్రామ్మణిజం

    'ఉమెన్ ఇన్ బ్రామ్మణిజం' చిత్రాన్ని నిషేధించాలని బ్రాహ్మణ వర్గాలు, మహిళా సంఘాలు పోరాడాయి. దాంతో ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అశ్లీలత, అసభ్యత, శృంగారమే లక్ష్యంగా, ఒక కులాన్ని కించపరిచే సన్నివేశాలతో నిర్మించిన 'వుమెన్‌ ఇన్‌ బ్రామ్మనిజం' చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని నీలం సహాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ చిత్రం ప్రజాప్రదర్శనకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ఈ చిత్రం నిర్మాతలు మళ్లీ కమిటీ నియామకం చెల్లదని హై కోర్టుకు వెళ్లారు.

    సారీ టీచర్

    మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా, యువతను పక్కదారి పట్టించేదిగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటూ ‘సారీ టీచర్' చిత్రం వచ్చింది. ఈ చిత్రంపై మొదట రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. అయితే 'సారీ టీచర్'కు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చామని.. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని సెన్సార్ తెలిపింది. సినిమా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు, మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా ఉందనడాన్ని, యువతను పక్కదారి పట్టించేదిగా ఉందన్న వాదనను సెన్సార్ బోర్డు కొట్టి పారేసింది. అయితే ఈ చిత్రం చట్టపరంగా వచ్చిన అన్ని అవరోధాలను తొలగించుకుని విడుదలైంది. సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ముఖ్యంగా ఈ చిత్రం రిలీజ్ కు థియోటర్స్ దొరకకపోవటం తో చావు కొట్టినట్లైంది.

    English summary
    Telugu film industry has produced more number of hit movies in 2012, when compared to previous. It has also its own share of movies that created huge controversy and faced the anger of different communities. Some films triggered a row for title issues, but major number of them landed in the controversy for abusive, sexual content and they made big news for all wrong reasons for long time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X