»   » డాన్స్ డే స్పెషల్: టాప్-5 డాన్స్ మూవీస్ (ఫోటో ఫీచర్)

డాన్స్ డే స్పెషల్: టాప్-5 డాన్స్ మూవీస్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో బాలీవుడ్ పరిశ్రమ తర్వాత అతిపెద్ద చిత్ర పరిశ్రమగా తెలుగు చిత్ర పరిశ్రమ దూసుకెలుతోంది. ప్రతి సంవత్సరం ఇండస్ట్రీలో వివిధ నేపథ్యాలతో సినిమాలు వస్తున్నాయి. ప్రత్యేకంగా డాన్స్ నేపథ్యంలోకూడా అనేక సినిమాలు వచ్చాయి.

కేవలం డాన్స్ నేపథ్యం ఉన్న సినిమాలు తీసుకుంటే....సాగర సంగమం, పౌర్ణమి, స్టైల్, సై ఆట, ప్రేమ యుద్దంలాంటి చిత్రాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. నేడు ఇంటర్నేషనల్ డాన్స్ డేను పురస్కరించుకుని టాప్ 5 తెలుగు డాన్సింగ్ ఫీచర్ సినిమాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

స్లైడ్ షోలో ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు, ఫోటోలు

సై ఆట

సై ఆట

కెఆర్‌కె పవన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన చిత్రం ‘సై ఆట'. డాన్స్ కొరియోగ్రాఫర్, ఆమె వద్ద శిక్షణ పొందే పిల్లలు....రెండు గ్యాంగ్‌ల శతృత్వం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. చార్మి, అజయ్, అలీ, చలపతిరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

స్టైల్

స్టైల్

ఒక టాలెంటెడ్ డాన్సర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్టైల్'. ప్రభుదేవా, రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర దారులుగా తెరకెక్కిన ఈ చిత్రం 2006లో విడుదలైంది. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది.

సాగర సంగమం

సాగర సంగమం

ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ 1983లో తెరకెక్కించిన చిత్రం ‘సాగర సంగమం'. కమల్ హాసన్, జయప్రద ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రం....భరత నాట్యం, కథాకళి, కుచిపూడి లాంటి డాన్స్ విద్యల్లో ఆరి తేరిన పేద కళాకారుడి చుట్టూ తిరుగుతుంది.

పౌర్ణమి

పౌర్ణమి

కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన ప్రభుదేవా 2006లో తెరకెక్కించిన చిత్రం ‘పౌర్ణమి'. ప్రభాస్, త్రిష, చార్మి ముఖ్య పాత్రలు పోషించారు. ఒక డాన్సర్ శివుడి పట్ల, తన గ్రామం పట్ల ఎంతటి అంకిత భావంతో ఉంటాడనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.

ప్రేమ యుద్దం

ప్రేమ యుద్దం

దర్శకుడు ఎస్.వి.రాజేంద్ర సింగ్ దర్శకత్వంలో 1990లో వచ్చిన డాన్స్ చిత్రం ‘ప్రేమ యుద్ధం'. నాగార్జున, అమల జంటగా నటించిన ఈచిత్రంలో మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించారు.

English summary
Tollywood is one of the leading film industries of India and it has explored almost all genres of filmmaking. Telugu film industry has also made experiments with dance movies and succeeded in a few attempts. Films like Style, Sye Aata, Sagara Sangamam, Pournami and Prema Yuddham are the top five dance movies in Telugu. On the eve of International Dance Day. We bring you the pictures and details of these films.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu