twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRRకి కొత్త తలనొప్పి.. కరోనా దెబ్బకు వాయిదా పడితే.. ఇప్పుడు సెన్సార్ కూడా చేయొద్దంటూ పిటిషన్!

    |

    సాధారణంగా తెలుగు సినిమా ఎలా ఉన్నా అందులో ఎలాంటి ఏదో ఒక అంశాన్ని వెతుక్కుని మరీ వివాదం చేయడం చాలా సాధారణం అయిపోయింది. ఇప్పుడు RRR విషయంలో కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఈ సినిమా విడుదల ఆపాలంటూ పిల్ దాఖలు అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

    బాహుబలి తర్వాత

    బాహుబలి తర్వాత

    బాహుబలి లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన రాజమౌళి ఆ తర్వాత నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ ప్రధాన పాత్రధారులుగా రౌద్రం రణం రుధిరం(RRR) అనే సినిమాను తెరకెక్కించారు. జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించగా రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. చరిత్రలో కలవని ఇద్దరు స్వతంత్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుంది అనే సినిమా రూపొందిస్తున్నట్లు సినిమా ప్రకటించిన కొన్ని రోజులకే ప్రకటించారు.

    అనేక వాయిదాల తర్వాత

    అనేక వాయిదాల తర్వాత

    ఈ RRR సినిమాలో సముద్రఖని, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్ లాంటి కీలక నటీనటులు నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తూ ఉండగా రాంచరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. ఇక అనేక వాయిదాల తర్వాత ఈ సినిమాని జనవరి ఏడవ తారీఖున థియేటర్లలో విడుదల చేయాలి అని భావిస్తూ రాజమౌళి నిర్ణయం తీసుకున్నారు.

    మరో రూపంలో కష్టాలు

    మరో రూపంలో కష్టాలు

    అయితే ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రం 'RRR'. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుండగా ఇప్పుడు మరో రూపంలో సినిమాకి కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమా విడుదల కాకుండా చూడాలని ఒక మహిళ కోర్టుకెక్కింది.

    సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్ద

    సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్ద

    రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'RRR' చిత్రంపై తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. స్వాతంత్ర్య సమరయోధులు - అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్‌లను అవమానించేలా మరియు వారి అనుచరుల మనోభావాలను దెబ్బ తీసే ప్రయత్నంలో సినిమా ఉద్దేశపూర్వకంగా వారి చరిత్రను వక్రీకరించిందని పిటిషనర్ ఆరోపించారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, విడుదలపై స్టే విధించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.

    Recommended Video

    Pan-India Movies Stepping Back, Here Is The Release Details | RRR | Radhe Shyam | Filmibeat Telugu
    కేసు ఏమవుతుందో?

    కేసు ఏమవుతుందో?

    ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ వ్యాజ్యం ప్రజాహిత వ్యాజ్యం కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు ఎక్కడ ఉన్నారో, ఏమయ్యారో ఎవరికీ తెలియదని, ఒకేసమయంలో మాయమైన ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనే కట్టుకథ ఇది అని రాజమౌళి ఎప్పటినుంచో చెబుతున్నారు. మరి ఈ కోర్టు కేసు ఏమవుతుందో? అనేది వేచి చూడాలి మరి.

    English summary
    PIL filed Against RRR Release In Telangana High Court
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X