»   » డైరక్టరే మారాడు..అదే హీరో..అదే నిర్మాత

డైరక్టరే మారాడు..అదే హీరో..అదే నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pilla Zamindar directors movie with PKC producer
హైదరాబాద్ : ఒక సారి ఓ హీరో కాంబినేషన్ లో హిట్ వస్తే... ఆ దర్శకుడు కానీ, నిర్మాత గానీ దాన్ని కొనసాగించాలనుకుంటారు. అయితే ఆ హీరో ఎదిగిపోతే ఆ కొనసాగింపు కష్టమవుతుంది. అలా కాకుండా హీరో.. సినిమాలు లేక కష్టాల్లో ఉంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు సుధీర్ బాబు పరిస్ధితి అదే. ఆడు మగాడ్రా బుజ్జీ తర్వాత అతని కెరీర్ గాడి తప్పింది. దాంతో తనకు హిట్ ఇచ్చిన నిర్మాతతో సినిమా చేయటానికి సిద్దమయ్యాడు.

'ప్రేమకథాచిత్రమ్‌' వంటి విజయాన్ని అందించిన ఆర్‌పీఏ క్రియేషన్స్‌ పతాకంపై సుదర్శన్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.'పిల్లజమిందార్‌' దర్శకుడు అశోక్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు తిరిగి తనకు విజయం పలకరిస్తుందని భావిస్తున్నాడు.

నిర్మాత మాట్లాడుతూ... ''అశోక్‌ సినిమా అంటే కుటుంబం మొత్తం కూర్చొని చూసేదిగా ఉంటుంది. సినిమాలో ఏదో తెలియని మాయ ఉంటుంది. అందుకే ఆయనతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. కథ సిద్ధమైంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాము''అన్నారు సుదర్శన్‌రెడ్డి.

ఇక సుధీర్‌బాబు, నందిత జంటగా నటిస్తున్న చిత్రం 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని'. కన్నడంలో విజయవంతమైన 'చార్మినార్‌'కిది రీమేక్‌. మాతృకను తెరకెక్కించిన ఆర్‌.చంద్రునే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శిరీషా శ్రీధర్‌ నిర్మాతలు.

సుధీర్‌ బాబు మాట్లాడుతూ ''ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నీ వినోద ప్రధానమైనవే. ఈ సినిమా వాటికి భిన్నంగా పాత రోజుల్ని గుర్తు చేసేలా ఉంటుంది'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''కుటుంబం, స్నేహితులు, ప్రేమ.. ఈ అంశాల మధ్య కథ నడుస్తుంది. కృష్ణమ్మకు సినిమాకు సంబంధమేంటనేది తెరపై చూడాల్సిందే'' అన్నారు.

సినిమాలో గిరిబాబు, ఎమ్మెస్‌ నారాయణ, సారిక రామచంద్రరావు, చిట్టిబాబు, కిషోర్‌దాస్‌, అభిజిత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: హరి, మాటలు: ఖదీర్‌బాబు, ఛాయాగ్రహణం: కె.ఎస్‌.చంద్రశేఖర్‌, కళ: నారాయణరెడ్డి

ఇంతకుముందు కన్నడ చిత్రం గోవిందాయనమహ ని పోటుగాడు గా రీమేక్ చేసిన శ్రీధర్ ...ఈ ఛార్మినార్ చిత్రం సైతం తనకు విజయం ఇస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన నందిత హీరోయిన్ గా ఎంపికైంది. ప్రేమ కధా చిత్రం కాంబినేషన్ కావటంతో బిజినెస్ బాగా జరుగుతుందని భావిస్తున్నారు.

English summary
Now ‘Prema Katha Chitram’ producer R Sudharshan Reddy is coming out with a new film as Production No. 2 under his banner RPA Creations. ‘Pilla Zamindaar’ fame Ashok is the director
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu