twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ ప్రశ్నించే సమయం వచ్చిందంటూ...!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ స్థాపించిన సమయంలో పలు సంచలన ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. తన పార్టీ లక్ష్యం అధికారం, పదువులు కాదని...ప్రజల తరుపున ఉండి వారి సమస్యలపై అధికార పక్షాన్ని ప్రశ్నించి వారికి మేలు జరిగేలా చేయడమే అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

    ప్రస్తుతం పవన్ కళ్యాన్ మద్దతు పలికిన బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ సర్కారు తొలిసారిగా రైల్వే చార్జీలను భారీ ఎత్తున పెంచేసింది. దీనిపై ప్రజల నుండి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెస్తున్నారు. పెరిగిన రైల్వే చార్జీలపై పవన్ కళ్యాణ్ ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అభిప్రాయపడుతున్నారు.

    Pawan Kalyan

    పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే...
    పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో 'గోపాలా గోపాలా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి ఇది రీమేక్. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న 'గోపాలా గోపాలా' షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. వెంకటేష్, ఇతర తారాగణంపై సీన్లు చిత్రీకరిస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా షూటింగులో జాయిన్ అవుతారు.

    సినిమాలో వెంకీ పాత్ర పేరు గోపాల్. పవన్ పోషించేది కూడా గోపాలుడి(కృష్ణుడి) పాత్రే కాబట్టి 'గోపాల గోపాల' టైటిల్ ఫైనల్ చేసారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో మిథున్‌ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, దీక్షాపంత్‌, అంజు అస్రాని తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జయనన్‌ విన్సెంట్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కూర్పు: గౌతంరాజు, కళ: బ్రహ్మ కడలి.

    English summary
    Pawan Kalyan to question on Train charges?. Modi's government on people hiking the railway passengers fare by 14.2% and freight charges by 6.5%. This appears something like an electric shock to common man.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X