»   » నన్ను అలా వాడుకోకండయ్యా... అంటూ అనసూయ రిక్వెస్ట్

నన్ను అలా వాడుకోకండయ్యా... అంటూ అనసూయ రిక్వెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యాంకర్ అనసూయ.... అతితక్కువ కాలంలోనే ఇంత పాపులర్ అయ్యిందంటే కేవలం అందం, టాలెంటు మాత్రమే కాదు, పలు వివాదాలు కూడా అనసూయ పాపులారిటీని బాగా పెంచేసాయి. తన బిహేవియర్ తో కొన్ని సందర్భాల్లో ఆమె పొగరుబోతు అనే ఇమేజ్ ను కూడా మూటగట్టుకుంది.

అప్పట్లో అనసూయ కొందరు స్టార్ హీరోల సినిమాలను రిజక్ట్ చేసింది. దీంతో సదరు ఫ్యాన్స్ అనూసయతో సోషల్ మీడియా ద్వారా గొడవ పెట్టుకున్నారు. అనసూయ కూడా తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. ఆమె తీరును కొందరు పొగరన్నారు, మరికొందరు తెగువ అన్నారు.

అనసూయతో పాటు మరో యాంకర్ రష్మి కూడా జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా పాపులర్ అయినవారే. పైకి ఇద్దరూ కలిసి ఉన్నట్లు కనిపించినా ఇద్దరి మధ్య క్యాట్ ఫైట్ నడుస్తుందనే వాదన ఉంది. ఇద్దరూ దాదాపుగా ఒకే సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనసూయ ననటించిన 'క్షణం', రష్మి నటించిన 'గుంటూరు టాకీస్' చిత్రాలు వారం గ్యాపుతో రిలీజ్ అయ్యాయి.

అనసూయ నటించిన 'క్షణం' చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రష్మి నటించిన 'గుంటూరు టాకీస్' మాత్రం బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే అందులో రష్మి గ్లామర్ పెర్ఫార్మెన్స్ కు మాత్రం మిక్డ్స్ టాక్ వచ్చింది. కొందరు ఆమె అందాల ప్రదర్శనను వల్గారిటీ అంటే...మరికొందరు మాత్రం పొగిడేసారు.

ఈ నేపథ్యంలో సక్సెస్ ఈజ్ బెస్ట్ రివేంజ్ అంటూ అనసూయ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. అనసూయ ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలియదు కానీ ఎవరికి నచ్చినట్లు వారు దీన్ని అన్వయించుకుంటున్నారు. తన ట్వీట్ వివాదాస్పదం అయిపోతోందని భావించిన అనసూయ వెంటనే ట్యామేజ్ కంట్రోల్ ట్వీట్స్ చేసింది. నన్ను మళ్లీ ఆ రకంగా వాడుకోకండయ్యా అంటూ ట్వీట్ చేసింది. స్లైడ్ షోలో అనసూయ ట్వీట్స్...

సక్సెస్ ఈజ్ బెస్ట్ రివేంజ్

సక్సెస్ ఈజ్ ది బెస్ట్ రివేంజ్ అంటూ అనసూయ చేసిన ట్వీట్...

అలావాడుకోకండయ్యా..

నన్ను మళ్లీ ఆ రకంగా వాడుకోకండయ్యా అంటూ అనసూయ రిక్వెస్ట్

సెల్ఫ రెస్పెక్ట్

నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఇగో అని అర్థం చేసుకంటున్నారంటూ అనసూయ ట్వీట్.

అనసూయ ట్వీట్

అనసూయ చేసిన మరో ఆసక్తికరమైన ట్వీట్

ఎవరి పాపన వారు పోతారు

ఎవరి పాపాన వారు పోతారు నువ్వెందుకు బురదలో రాళ్లు చల్లండం అంటూ అనసూయ ట్వీట్

అనసూయ ట్వీట్

అనసూయ చేసిన మరో ఆసక్తికరమైన ట్వీట్

English summary
"Guyz guyz guyz!! Plz dont involve anyone irrelevant here na.. My humble request🙏🏻 Plz! Nannu malli aa rakanga vaadukokandayya.." Anasuya tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu