»   » బ్రేకింగ్: మహేష్‌కు ప్రధాని ఆఫీస్‌ నుంచి మెసేజ్.. అప్పుడు పవన్.. ఇప్పుడు ప్రిన్స్

బ్రేకింగ్: మహేష్‌కు ప్రధాని ఆఫీస్‌ నుంచి మెసేజ్.. అప్పుడు పవన్.. ఇప్పుడు ప్రిన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేశ్‌బాబుకు సినిమాలపై ధ్యాస తప్ప రాజకీయాల జోలికి పోయిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో తన బావ గల్లా జయదేవ్‌కు పరోక్షంగా మద్దతు తెలపడం తప్ప ఎక్కడ పాలిటిక్స్ వ్యవహారాల్లో తలదూర్చిన విషయం కనిపించదు. అయితే మహేష్ బాబుకు ప్రధాని నరేంద్రమోదీ ఆఫీస్‌కు సంబంధమేమిటని ఆలోచిస్తున్నారా? అవును ప్రిన్స్ మహేశ్ బాబుకు ప్రధాని కార్యాలయం (పీఎంవో) నుంచి ఓ సందేశం ఇటీవల వచ్చింది. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖకు సంబంధించిన సంస్థ ఇటీవల వెల్లడించింది. పీఎంవో నుంచి మహేష్‌కు వచ్చిన సందేశమేమిటంటే..

చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్

చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్

ప్రతీ ఏడాది మాదిరిగానే రాష్ట్రంలో నవంబర్ నెలలో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ జరుగనున్నది. ఈ చిత్రోత్సవం గురించి రాష్ట్రంలో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. చిత్రాల ఎంపిక, అతిథుల ఎంపిక వ్యవహారంపై అధికారులు, నిర్వాహకులు దృష్టి పెట్టారు. ఇప్పటికే అతిథుల జాబితాను సిద్ధం చేశారు. పలువురిని సంప్రదించడం కూడా జరుగుతున్నది.

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్

అలాగే ప్రతీ ఏడాది జరిగినట్టుగానే నవంబర్ చివరి మాసంలో గోవాలో అంతర్జాతీయ చిత్రోత్సావానికి ఏర్పాట్లు వేగం పుంజుకొన్నాయి. చిత్రోత్సవంలో ప్రదర్శించే ఇప్పటికే చిత్రాల ఎంపిక జరిగినట్టు సమాచారం. అలాగే అతిథులను కూడా ఆహ్వానించేందుకు జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు అతిథులను సంప్రదిస్తున్నారు.

మహేష్‌తో సంప్రదింపులు

మహేష్‌తో సంప్రదింపులు

చిత్రోత్సవాల్లో భాగంగానే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), సెన్సార్ బోర్డు అధికారులు ఇటీవల ప్రిన్స్ మహేశ్‌ను సంప్రదించారు. అధికారులు మహేశ్‌ను వ్యక్తిగతంగా సంప్రదించేందుకు ఫోన్ నంబర్, ఈ-మెయిల్‌ అడ్రస్‌ను తన వ్యక్తిగత సిబ్బంది నుంచి తీసుకొన్నారు. ఈ మేరకు ప్రిన్స్ మహేష్‌కు ఓ సందేశాన్ని చేరవేశారనేది వార్త సారాంశం.

ప్రిన్స్‌కు ఆహ్వానం

ప్రిన్స్‌కు ఆహ్వానం

ఈ నేపథ్యంలోనే ప్రిన్స్ మహేశ్ బాబును ప్రధాని కార్యాలయం నుంచి మెసేజ్ అందింది. అయితే హైదరాబాద్‌లో జరిగే బాలల చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నారా? లేదా గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌ కోసం ప్రిన్స్ మహేష్‌ను సంప్రదించారా అనే విషయంపై క్లారిటీ లేదు.

గతంలో పవన్ కల్యాణ్

గతంలో పవన్ కల్యాణ్

గతంలో హైదరాబాద్‌లో జరిగిన బాలల చిత్రోత్సవంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రిన్స్ మహేష్ బాబును ఈ చిత్రోత్సవానికి ఆహ్వానించే అవకాశం కనిపిస్తున్నది. సినిమా ఉత్సవాలకు దూరంగా ఉండే ప్రిన్స్ పీఎంవో ఆహ్వానాన్ని మన్నించారా లేదా అనేది త్వరలోనే అధికారికంగా తెలుస్తుంది.

English summary
Prince Mahesh Babu's latest movie hits theaters recently. This movie got mixed responses from the Audience. Apart from this, Mahesh Babu got a message from the PMO. That messages main essence is Mahesh has been invited for Film Festival as Guest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu