»   » మళ్ళీ అరెస్టైన భువనేశ్వరి... బెయిల్ దొరకని కేసులు

మళ్ళీ అరెస్టైన భువనేశ్వరి... బెయిల్ దొరకని కేసులు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: సినీ నటి భువనేశ్వరి మళ్లీ అరెస్టు అయ్యింది. వారం రోజుల క్రితం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని ప్రార్థనా థియేటర్‌లో చోటు చేసుకున్న వివాదం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ కేసులో అరెస్టయిన భువనేశ్వరితో పాటు మరో నలుగు పుళల్ జైల్లో ఉన్నారు. ఆమె అరెస్టుతో ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. కేకే నగర్‌కు చెందిన రియల్ వ్యాపారి గురునాథన్ ఇచ్చిన రూ.1.5 కోట్ల మోసం ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం భువనేశ్వరి మళ్లీ అరెస్టు అయ్యారు.

  వినాయకరాజ్ అనే వ్యక్తి ఇచ్చిన తొమ్మిది లక్షల మోసం, దాడి, బెదిరింపు ఫిర్యాదు, ఓ టీవీ ఛానల్‌తో కుదుర్చుకున్న నకిలీ ఒప్పంద వ్యవహారం ఫిర్యాదు, పోరూర్‌లో రూ.40 లక్షల మోసం ఫిర్యాదు, కుమార్ అనే నిర్మాత వద్ద రూ.10 లక్షల మోసం.. ఇలా ఫిర్యాదుల మీద ఫిర్యాదులు భువనేశ్వరిపై వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులు సీనియర్ పోలీస్ అధికారలను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి.

  టీవీ సీరియళ్లల్లో లేడీ విలనిజంతో ప్రేక్షకుల్ని కట్టి పడేసిన నటి భువనేశ్వరి రియల్ లైఫ్‌లోనూ అదే బాటలో పయనించి ఇబ్బందుల్లో పడ్డా రు. పోలీసుల చేతికి చిక్కిన ఆమెపై ప్రస్తుతం ఫిర్యాదు లు, కేసుల మోత మోగుతోంది. దీంతో ఆమెపై గూండా చట్టం ప్రయోగించేందుకు నగర పోలీసు యంత్రాంగం కసరత్తుల్లో పడింది.

  ఈ కేసులన్నింటిని ఒక్కటిగా చేసి భువనేశ్వరిపై గుండా చట్టం ప్రయోగానికి కసరత్తులు జరుగుతున్నాయి. ఆంబూరు, చెన్నై, ఈస్ట్ కోస్ట్ రోడ్డు స్టేషన్లలో నమోదైన కేసులతో పాటు ప్రస్తుతం వచ్చిన ఫిర్యాదులన్నింటి పరిశీలన పూర్తి కాగానే ఆమెపై ఈ చట్టాన్ని ప్రయోగించేందుకు నగర పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఈ చట్టం కింద అరెస్టయ్యే వారికి ఏడాది పాటు బెయిల్ లభించదు.

  ఇదిలా ఉండగా విచారణ నిమిత్తం గురువారం భువనేశ్వరిని సైదాపేట కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమెను మళ్లీ రిమాండ్‌కు తరలించారు. ఈ సమయంలో కోర్టు వద్ద ఆమె మీడియా వారిని కలిసి మాట్లాడింది. ఆమె మాటల్లో... "నా వెనకాల ఏదో కుట్ర జరుగుతోంది. నన్ను ఎవరో ఇరుకిస్తున్నారు. పక్కా ప్లానింగ్ ప్రకారం కుట్ర అమలు అవుతోంది. అందుకనే నా మీద ఇన్ని కేసులు ఒకేసారి పడ్డాయి. నేను బయిటకు రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని,సత్యం నిరూపింపబడుతుందని నమ్ముతున్నా. ఈ సమయంలో ఇంతకన్నా ఏమీ మాట్లాడలేను. ఈ కేసులన్నిటినీ నేను లీగల్ గానే ఎదుర్కొంటాను." అంది.

  తమిళ, తెలుగు టీవీ ధారావాహికల్లో లేడి విలన్‌గా, సినిమాల్లో వ్యాంప్ పాత్రల్లో తన నటనా చాతుర్యాన్ని చాటుకున్న ఈ భువనేశ్వరి ఇటీవల వ్యభిచార నేరం కింద అరెస్టు అయ్యారు. ఈ కేసులో చిక్కుకున్న సమయంలో ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు కోలివుడ్‌ను కుదిపేశాయి. కొందరు నటీమణుల గుట్టును రట్టు చేస్తూ చేసిన ఆరోపణలు చివరకు ఆమె కెరీర్ మీద ప్రభావం చూపించాయి. తమిళ చిత్ర, ఛానళ్లకు కాస్త దూరంగా ఉంటున్న ఈమె అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ ద్వారా మహిళా నేతగా రాజకీయ పయనం సాగిస్తున్న ఆమె జీవితం సినిమాను తలపించక మానలేదు అంటున్నారు.

  English summary
  Actress Bhuvaneswari has been in the news for the past fortnight or so for all the wrong reasons. In the past couple of weeks, as many as three cases had been filed against the actress since been arrested by the Chennai police. The actress, who played the (in)famous role of a ‘call girl’ in Shankar’s Boys, was produced before the Saidapet Magistrate , Chennai by the police. The three cases involve indulging in violent acts inside a theatre's premises. This particular incident reportedly took place at a drive-in theatre on the outskirts of Chennai. It is also said that the police are planning to invoke Goondas’ Act against her.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more