twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోసపోయిన ఫ్యాన్స్: ‘S/o సత్యమూర్తి’ ఆడియో వేడుకపై కేసు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘S/o సత్యమూర్తి' ఆడియో వేడుక ఇటీవల గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకను శ్రేయాస్ మీడియా వారు ఆర్గనైజ్ చేసారు. తాజాగా ఈ వేడుకపై వివాదం నెలకొంది. ఆర్గనైజర్లపై పోలీసులు కేసు కూడా నమోదు చేసారు.

    ఈ ఆడియో వేడక కోసం ఆర్గనైజర్లయి శ్రేయాస్ మీడియా వారు 6000 పాసులు అమ్మారు. అయితే ఆడియో వేడుకలోకి కేవలం 2000 పాస్ హోల్డర్స్ ను మాత్రమే అనుమతించారు. క్రౌడ్ ఎక్కువగా ఉండటంతో మరో 4 వేల మంది పాసులు ఉన్నా లోనికి వెళ్లలేక పోయారు. ఈ పరిణామాలతో ఆగ్రహం చెందిన ఫ్యాన్స్ హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్ల తెలుస్తోంది.

    Police Case filed on S/o Satyamurthy audio launch

    పరిమితికి మించి పాసులు జారీ చేసి డబ్బులు దండుకున్నారని, మోస పూరితంగా వ్యవహరించారని అభిమానులు ఆరోపిస్తున్నారు. పరిమితికి మించి పాసులు ఎందుకు జారీ చేసారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పోలీసులు నిర్వాహకులపై చర్యతీసుకునే అవకాశం ఉంది.

    ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

    English summary
    This is surely a shocking news about the most trending movie S/O Satyamurthy starring Allu Arjun, Samantha, Adah Sharma, Nitya Menon and so on. This movie’s audio release has hit the headlines yesterday for staging many controversies. Now, a police case was filed on the movie’s Audio launch organizers, Shreyas Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X