For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!

  |

  నటన మీద ఉన్న మక్కువతో ఎంతో మంది తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారిలో కొందరు తమ టాలెంట్లను నిరూపించుకుని సత్తా చాటుతుంటే.. మరికొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలకే పరిమితమై కనుమరుగు అవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎటువంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో విశ్వంత్. మొదటి సినిమాలోనే మంచి నటనతో ఆకట్టుకుని వరుసగా ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిపై పోలీస్ కేసు నమోదైంది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  హీరో విశ్వంత్ అసలు బ్యాగ్రౌండ్ ఇదే

  హీరో విశ్వంత్ అసలు బ్యాగ్రౌండ్ ఇదే

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సామర్లకోటలో విశ్వంత్ దుడ్డుంపూడి జన్మించాడు. పదో తరగతి వరకు విశాఖపట్నంలో చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్మీడియన్‌ను మాత్రం హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ డిగ్రీని తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.

  అలా ఎంట్రీ.. మొదటిదే సూపర్ హిట్

  అలా ఎంట్రీ.. మొదటిదే సూపర్ హిట్

  ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు తీసిన ‘కేరింత' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు యంగ్ హీరో విశ్వంత్. ఇందులో మెయిన్ హీరో సుమంత్ అశ్విన్ కాగా, అతడు సెకెండ్ హీరోగా చేశాడు. మొదటి సినిమానే అయినా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా తన ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశాల్లో పరిణితితో నటించి ప్రశంసలు పొందాడు.

  తెలుగులో సినిమాలు.. నానిది కూడా

  తెలుగులో సినిమాలు.. నానిది కూడా

  ‘కేరింత' తర్వాత విశ్వంత్.. మోహన్ లాల్.. గౌతమి ప్రధాన పాత్రలు పోషించిన ‘మనమంతా' అనే సినిమాలో నటించాడు. ఇందులో కూడా మంచి పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు. దీని తర్వాత ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్', ‘తోలు బొమ్మలాట', ‘ఓ పిట్ట కథ' వంటి చిత్రాల్లో లీడ్ రోల్ చేశాడు. ఇక, నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ'లోనూ కీలక పాత్ర పోషించి మెప్పించిన విషయం తెలిసిందే.

  యంగ్ హీరో విశ్వంత్‌పై చీటింగ్ కేసు

  యంగ్ హీరో విశ్వంత్‌పై చీటింగ్ కేసు

  వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విశ్వంత్‌. ఇప్పటికే ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్‌లలో నటించిన అతడికి తాజాగా భారీ షాక్ తగిలింది. గత రాత్రి (మంగళవారం) కొందరు అతడిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఫిర్యాదును స్వీకరించి ఈ యంగ్ హీరోపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.

  నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు

  నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు

  బాధితులు చెబుతోన్న సమాచారం ప్రకారం.. యంగ్ హీరో విశ్వంత్ కొందరి దగ్గర తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. డబ్బు తీసుకొని కార్లు ఇప్పించలేదని సమాచారం. చాలా రోజుల నుంచి అతడు పత్తా లేకుండా వెళ్లిపోయాడని, ఫోన్లు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాళ్లంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేసు పెట్టినట్లు చెబుతున్నారు.

  హీరో విశ్వంత్ ఎక్కడ? స్పందన లేదు

  హీరో విశ్వంత్ ఎక్కడ? స్పందన లేదు

  విశ్వంత్‌పై కేసు నమోదైన తర్వాత అతడి నుంచి స్పందన రాలేదు. అంతేకాదు, ఈ యంగ్ హీరో ఎక్కడ ఉన్నాడన్న దానిపైనా సస్పెన్స్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అతడు.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించకపోవడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా, అతడు ప్రస్తుతం ‘కాదల్', ‘BFF' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.

  English summary
  Viswant was born in Samarlakota, Kakinada into a business family. His father Lakshmi Kumar Duddumpudi is a Businessman and mother Aruna Sri, a homemaker. He started his schooling in Timpany School Visakhapatnam after which he changed to Kakinada and then to Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X