twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ మీద పోలీస్ కేసు.. పవన్ దెబ్బకు మైత్రీ మూవీ మేకర్స్ మీద కూడా?

    |

    పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. బన్నీ క్రేజ్ దృష్ట్యా లోకల్ సహా జాతీయ స్థాయిలో పలు బ్రాండ్లు ఆయనని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా పలు సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నాడు. అయితే బన్నీ ఆ సంస్థల కోసం చేస్తున్న యాడ్స్‌ వరుస వివాదాలకు దారి తీస్తున్నాయి. ముందుగా రాపిడో సంస్థ బన్నీతో చేయించిన ప్రకటన వివాదాస్పదం అయింది. సిటీ బస్సుల గురించి లేటు అనే అర్ధం వచ్చేలా యాడ్‌లో చూపించడం మీద టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఆ యాడ్ తొలగించకపోతే కేసు వేస్తామని హెచ్చరించడంతో దెబ్బకు దిగి వచ్చిన రాపిడో యాజమాన్యం అందులో సిటీ బస్సుల గురించి చేసిన షాట్ తొలగించింది. తర్వాత అల్లు అర్జున్ చేసిన జొమాటో యాడ్ కూడా వివాదానికి దారి తీసింది.

    ఈ యాడ్‌లో నటుడు సుబ్బరాజును బన్నీ కొట్టగా.. ఆ దెబ్బకు సుబ్బరాజు గాల్లో ఎగురుతాడు, 'బన్నీ నన్ను త్వరగా కిందకు దించవా..' అని సుబ్బరాజు అడిగితే.. 'సౌత్ సినిమా కదా..? ఎక్కువ సేపు ఎగరాలి' అని బన్నీ అనడంతో సౌత్ హీరో అయి ఉండి సౌత్ సినిమాలు, అందులో యాక్షన్ సీక్వెన్స్‌లపై కామెంట్ చేయడంతో పెద్ద ఎత్తున వివాదం రేగింది. అది సద్దుమణిగింది అంటే ఇప్పుడు అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ యాడ్ చేశాడు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రకటనపై ప్రస్తుతం వివాదం రేగింది. అదేమంటే కొత్త ఉపేందర్‌రెడ్డి అనే సామాజిక కార్యకర్త అల్లు అర్జున్‌పై హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బన్నీ నటించిన శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యాపార ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    police cases filed on allu arjun and mythri movie makers in separate incidents.

    ర్యాంకుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు పేర్కొంటూ బన్నీతో పాటు శ్రీ చైతన్య విద్యాసంస్థల పై కేసు పెట్టారు. ఇలా తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇక మరోపక్క 'అంటే.. సుందరానికీ' సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సహా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రేయాస్ మీడియాపై హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాదాపూర్ శిల్పకళా వేదికగా ఈ నెల 9న జరిగిన 'అంటే సుందరానికీ' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రావడంతో.. భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించారు అనే కారణంతో పోలీసులు సుమోటో కేసు నమోదు చేసినట్లు సమాచారం.

    English summary
    police cases filed on allu arjun and mythri movie makers in separate incidents.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X