For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'టెంపర్' ఫ్యాన్స్ షో: పోలీస్ క్లియరెన్స్ లెటర్ ఇదిగో(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : రేపు (13 వ తేదీ)న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఎన్టీఆర్ తాజా చిత్రం టెంపర్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బెనిఫిట్ షో లు రేపు తెల్లవారు ఝామునుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈ షోలకు పోలీస్ ల నుంచి ఫర్మిషన్ కావాల్సి ఉంటుంది. హైదరాబాద్ కుకుట్ పల్లి లోని మల్లి ఖార్జున థియోటర్ లో రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ షో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పోలిస్ వారు ఈ థియోటర్ కు షో వేసుకోవటానికి ఫర్మిషన్ ఇచ్చారు. మీరు ఇక్కడ చూస్తున్నది ఆ షోకు ఇఛ్చిన ఫర్మిషన్ లెటరే.

  రిలీజ్ రోజు..బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలు మామూలే. అయితే వీటిని హీరో వీరాభిమానులు నిర్వహిస్తూంటారు. ఆ వచ్చిన డబ్బులో ఖర్చులు పోను...ఛారిటికీ ఇస్తూంటారు. ఇప్పుడు రాజమౌళి కుమారుడు..కార్తికేయ ...ఎన్టీఆర్ తాజా చిత్రం టెంపర్ ఫ్యాన్స్ షో వేయటానికి సిద్దమవుతున్నారు. హైదరాబాద్ లోని మల్లిఖార్జున థియోటర్ లో ఆయన ఫ్యాన్స్ షో నిర్వహించనున్నారని సమాచారం. ఈ షోకు రాజమౌళి కుటుంబం హాజరవుతోందని తెలుస్తోంది. ఈ మేరకు నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫర్మిషన్ తెచ్చుకున్నారు.

  'టెంపర్' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఎ' సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రప్రంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి జగన్నాధ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగ్స్ మరియు ఎన్.టి.ఆర్ ని చూపించిన విధానం ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని సమాచారం. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

  Police Clearance for Temper's First Show!

  శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్‌'. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్‌ నిర్మాత. ఈ సినిమా ఆడియో, ట్రైలర్స్ ఈ మధ్యనే విడుదల అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. ‘టెంపర్' సినిమా రన్ టైం సుమారు 141 నిమిషాలు ఉంటుంది. ఇదే లెంగ్త్ కి ఈ చిత్ర టీం ఫస్ట్ కాపీని రెడీ చేసారని సమాచారం. అందులో ఫస్ట్ హాఫ్ 1 గంట 8 నిమిషాలు, సెకండాఫ్ 1 గంట 13 నిమిషాలు ఉండబోతోంది. ఎన్.టి.ఆర్, అతని టీం సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది.

  ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోస్ కి సంబందించిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించనున్న ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది.

  Police Clearance for Temper's First Show!

  బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మా సినిమా ‘టెంపర్‌'విడుదలకు సిద్గంగా ఉంది. 13న కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా విడుదల చేస్తాం . ఎన్టీఆర్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుంది'' అని అన్నారు. చొక్కా లేని ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఇప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేశారు. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఈ లుక్‌తో అభిమానులకు మరింత దగ్గరవుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పూరి జగన్‌ తన సినిమాలో హీరోలను విభిన్నంగా చూపించడంలో ముందుంటారు. తాజాగా ఎన్టీఆర్‌ విషయంలోనూ అదే రిపీట్‌ అయ్యింది. కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది.

  ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

  English summary
  Police Permissions has been granted for Management of MALLIKARJUNA THEATRE (KPHB) for the Benefit Show of NTR starrer 'Temper' on January 13th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X