»   » ‘ప్రమాదం వల్ల మరణించినట్లు’ ఎందుకు నమోదు చేసారు?? ఓంపురి ది సహజ మరణం కాదా!?

‘ప్రమాదం వల్ల మరణించినట్లు’ ఎందుకు నమోదు చేసారు?? ఓంపురి ది సహజ మరణం కాదా!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీనటుడు ఓంపురి మృతికి సంబంధించి ముంబై పోలీసులు 'ప్రమాదం వల్ల మరణించినట్లు'(ఏడీఆర్‌) శనివారం కేసు నమోదు చేశారు. స్వగృహంలో ఒంటరిగా ఉంటున్న ఓంపురి శుక్రవారం గుండెపోటుతో చనిపోవడం తెలిసిందే.గుండెపోటు తర్వాత వంటగదిలో నేలపై కుప్పకూలిపోయిన ఆయనకు గాయం కూడా అయ్యింది. సాధారణ ప్రక్రియ కింద ఏడీఆర్‌ నమోదు చేశామని, ఓంపురి మృతిపై ఇంతవరకు అనుమానించదగ్గ అంశమేదీ బయటపడలేదని పోలీసులు తెలిపారు.

"నాకు చావంటేభయంలేదు కానీ అనారోగ్యానికి గురవడం అంటే భయం. ఆరోగ్యం పాడైమంచాన పడి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పక్కవారిపై ఆధారపడే వారిని చూసినప్పుడల్లా నాకూ అదే పరిస్థితి వస్తుందేమోనన్న భయం ఉండేది కానీ చావంటే భయం లేదు. చావును కూడా ఎవరూ ముందే వూహించలేరు. ఎప్పుడో ఒకప్పుడు నిద్రలో కన్నుమూస్తాం. ఓంపురి నిన్నరాత్రి 7.22 నిమిషాలకు కన్నుమూశారు.. అన్న వార్త ఉదయం ప్రజలకు తెలుస్తుంది" అంటూ సంవత్సరం క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పారట ఓం పురి..

 Police register ‘Accidental Death Report’

ఓంపురి(66) శుక్రవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో సృగృహంలోనే ప్రాణాలు విడిచారు. బాలీవుడ్‌తో పాటు పలు హాలీవుడ్‌, పాకిస్థాన్‌ చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులో 'అంకురం' చిత్రంలో నటించారు. అద్భుత నటనతో పలుసార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఓంపురి మరణంతో బాలీవుడ్‌ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

ఓంపురి హరియాణాలోని అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో అక్టోబర్‌ 18, 1950లో జన్మించారు. పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ ఇండియాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1976లో మరాఠీ చిత్రం 'ఘాశీరామ్‌ కొత్వాల్‌'తో సినీరంగ ప్రవేశం చేశారు. 1982లో 'ఆరోహణ్‌', 1984లో 'అర్ధ్‌ సత్య' చిత్రాలకు గానుఆయన జాతీయ ఉత్తమనటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' పురస్కారం పొందారు. ఎనిమిది సార్లు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు.

English summary
Police register ‘Accidental Death Report’ in connection with Om Puri’s death
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X