»   » దిక్కు లేక రోడ్డున పడ్డ హీరోయిన్ కథ

దిక్కు లేక రోడ్డున పడ్డ హీరోయిన్ కథ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: వెండితెరపై ఒక్కవెలుగు వెలిగి పరిస్థితుల ప్రభావంతో దుర్భర జీవితం సాగించిన హీరోయిన్స్ జీవితాల కథాంశంతో 'అభినేత్రి' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి పూజాగాంధీ నిర్మాతగా మారడంతో పాటు ప్రధాన పాత్రను కూడా పోషిస్తోంది. కట్టుబొట్టు అలనాటి నటి కల్పనను పోలిఉన్నా ఆమె జీవితానికి అభినేత్రి సినిమాకు సంబంధం లేదని పూజా స్పష్టం చేశారు.

ఏడో దశకం నాటి పరిస్థితుల నేపథ్యంలో కథాగమనం ఉంటుంది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చిత్రీకరణను కొనసాగించేందుకు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొనాల్సి వచ్చిందని తెలిపారు. రంగస్థలం నేపథ్యం కోసం ఉత్తర కర్ణాటక ప్రాంతంలో చిత్రీకరణను పూర్తి చేశారు. అభినేత్రిలో అభినయం సవాల్‌గా తీసుకుని పూర్తిచేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే టాకీ పార్ట్‌ పూర్తయింది. ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోంది. నిర్మాణానంతర పనుల్ని పూర్తి చేసి వచ్చేనెలలో అభినేత్రిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

Pooja Gandhi Playing Actress Kalpana's Role In Abhinetri

ముత్తులక్ష్మి పేరుతో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. జగ్గి ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో ముత్తులక్ష్మి కూడా ఓ పాత్రను పోషించనుంది. సినిమా వివరాల్ని మీడియాకు వెల్లడించారు. ఈ వివరాలు విన్న వాళ్లు ఆమెను ఈ ప్రాజెక్టుకి ఎలా ఒప్పించగలిగారో అర్దమవుతోంది అంటున్నారు. పోలీసులు ఆమెపై చూపిన దాష్టీకం ఈ సినిమాలో చూపించే అవకాసం ఉందంటున్నారు. మరో ప్రక్క పూజాగాంధీ 'ముత్తులక్ష్మి వైఫ్‌ ఆఫ్‌ వీరప్పన్‌ ' టైటిల్ తో ఓ చిత్రం చేస్తోంది.

దాదాపు రెండు దశాబ్దాల పాటు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేసిన అడవి దొంగ వీరప్పన్‌ భార్య పేరు ముత్తులక్ష్మి. ఆమె జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో ముత్తులక్ష్మి పాత్రను ప్రముఖ కన్నడ నటి పూజాగాంధీ పోషించనుంది. అంతేకాదు ఈ సినిమాకు ఆమె నిర్మాతల్లో ఒకరు. త్వరలోనే ఇతర వివరాలు వెల్లడికానున్నాయి.

English summary

 Pooja Gandhi will play the role of a yesteryear actress in her upcoming Kannada film 'Abhinetri'. But speculations are rife that the film is based on the life of Kannada actress Kalpana and Pooja will apparently play the role of Kalpana in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu