»   » ఆ సినిమా వల్లే దూరమయ్యా, ఇక వదులుకోను: డిజె బ్యూటీ పూజా

ఆ సినిమా వల్లే దూరమయ్యా, ఇక వదులుకోను: డిజె బ్యూటీ పూజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన 'డిజె-దువ్వాడ జగన్నాథమ్' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ పూజా హెగ్డే మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ - '''ముకుంద' సినిమా తర్వాత తెలుగులో సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చాయని, బాలీవుడ్‌లో 'మొహంజదారో' సినిమా చేస్తుండటం....ఆ సినిమాకే ఎక్కువ రోజులు పరిమితం కావడం వల్లే తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపారు.

ఆ సినిమా మిస్సయ్యాను

ఆ సినిమా మిస్సయ్యాను

అలాగే తెలుగులో అప్పటి వరకు చేసిన రెండు సినిమాల్లో చాలా డీసెంట్‌ పాత్రలు చేశాను. కాంటెపరరీ పాత్ర చేయాలనుకుంటున్న సమయంలో 'డీజే దువ్వాడ జగన్నాథమ్‌' సినిమాలో అవకాశం వచ్చింది. హరీష్‌శంకర్‌గారు ఫోన్‌ చేసి 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' సినిమాలో నటించలేదు. ఈ సినిమా(డిజె) అయినా చెయ్యాలని అన్నారు.

డిజె కథ నచ్చింది

డిజె కథ నచ్చింది

డిజె కథ వినగానే నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించాను. తెలుగులో నేను చేసిన సినిమాలు కానీ, అప్పటి పరిస్థితులు నటీనటులు అన్ని నాకు బాగా నచ్చాయి.

నేను ఇక్కడి పిల్లగానే ఫీలవుతా

నేను ఇక్కడి పిల్లగానే ఫీలవుతా

తెలుగు సినిమా పరిశ్రమతో నాకు మంచి రిలేషన్‌ ఉందనిపించింది. నేను ఇక్కడి పిల్లనే అని భావిస్తున్నాను. అల్లు అర్జున్‌ సెట్స్‌లో చాలా సరదాగా ఉంటాడు. సెట్స్‌లో తనుంటే టెన్షన్‌ ఉండదు. సినిమా ఆసాంతం ఎంజాయ్‌ చేశాను అని పూజా తెలిపారు.

బన్నీ, హరీష్ గురించి

బన్నీ, హరీష్ గురించి

"బన్ని జనరిక్‌ యాక్టర్‌. తను నుండి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నటన పరంగా, డ్యాన్సులు పరంగా నాకు టిప్స్‌ ఇచ్చాడు. ఒక నటి డీజే దువ్వాడ జగన్నాథమ్‌తో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలిగింది. హరీష్‌ శంకర్‌ బెస్ట్‌ డైరెక్టర్‌. ఆయన సంభాషణలు చక్కగా రాస్తాడు. సెట్స్‌లో కూల్‌గా ఉంటాడు. ఆయనతో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంటుంది.'' అన్ని పూజా తెలిపారు.

English summary
Pooja Hegde's Duvvada Jagannadham press meet. DJ - Duvvada Jagannadham movie is a romantic action entertainer written and directed by Harish Shankar and produced by Dil Raju under Sri Venkateswara Creations banner while Devi Sri Prasad scored music for this movie Stylish star Allu Arjun playing the title role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu