బాంబు పేల్చిన పూనమ్ కౌర్, చెంప పగలగొట్టా.. అర్థ రాత్రి అలా, టాలీవుడ్ సెక్స్ రాకెట్‌లో మరో కోణం!

Recommended Video

Poonam Kaur Sensational Comments On Tollywood Issue

సంచలనం రేపుతున్న చికాగో సెక్స్ రాకెట్ గురించి టాలీవుడ్ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సెక్స్ రాకెట్ వ్యవహారం టాలీవుడ్ ని కుదుపునకు గురి చేస్తోంది. కాస్టింగ్ కౌచ్ వివాదం ఇంకా సమసిపోక ముందే చికాగో సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ దందా సాగిస్తున్న కిషన్ ముడుగుముడి, అతడి సతీమణి చంద్ర అలియాజ్ విభని అమెరికా పోలీసులు అరెస్టు చేసి కటకటాల లోకి నెట్టారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అమెరికా పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంచలన వాస్తవాలు వెలుగులోకి తీసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ చికాగో సెక్స్ రాకెట్ గురించి మరో బాంబు పేల్చింది.

వ్యభిచారంతోనే

వ్యభిచారంతోనే

లగ్జరీ జీవితం కోసం కిషన్ దంపతులు అడ్డదారులు తొక్కారు. గతంలో కిషన్ కొన్ని చిత్రాలకు సహ నిర్మాత కావడంతో సినీ ఇండస్ట్రీలో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ పరిచయాలతోనే అమెరికా కేద్రంగా కిషన్ టాలీవుడ్ హీరోయిన్లని ట్రాప్ లోకి దించి వ్యభిచారం చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తేలింది.

పోలిసుల విచారణలో సంచలనాలు

పోలిసుల విచారణలో సంచలనాలు

అమెరికా పోలీసులు ఈ మొత్తం వ్యవహారం గురించి అమెరికా పోలీసులు కూపీ లాగీ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంచలన ఆధారాలు సేకరించారు. కనీసం ఒక్క ఇండియన్ ఫ్యామిలీ కూడా లేని ప్రాంతంలో కిషన్ దంపతులు హీరోయిన్లు, వర్ధమాన నటీమణులతో ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు తేలింది.

బాంబు పేల్చిన పూనమ్ కౌర్

బాంబు పేల్చిన పూనమ్ కౌర్

ఇప్పటికే చాలా అంన్డి హీరోయిన్లు, యాంకర్స్ అమెరికా సెక్స్ రాకెట్ గురించి పలు విషయాలు వెల్లడించారు. తాజగా పూనమ్ కౌర్ కూడా సెక్స్ రాకెట్ గురించి స్పందించింది. అసలు కిషన్, చంద్ర దంపతులు భార్యాభర్తలు కాదని బాంబు పేల్చింది.

ఎప్పుడూ పరోక్షంగానే

ఎప్పుడూ పరోక్షంగానే

పూనమ్ కౌర్ టాలీవుడ్ సెక్స్ రాకెట్ పై స్పందించడంతో ఈ విషయం మరో మారు సంచలనంగా మారింది. పూనమ్ కౌర్ ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

కేసు గురించి ప్రస్తావిస్తూ

కేసు గురించి ప్రస్తావిస్తూ

అమెరికాలో కిషన్, చంద్ర దంపతులపై నమోదైన కేసు గురించి ప్రస్తావిస్తూ పూనమ్ కౌర్ టాలీవుడ్ సెక్స్ టికెట్ గురించి స్పందించింది. ఈ వ్యవహారంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలని కూడా పూనమ్ వెల్లడించింది.

చెంప పగలగొట్టా

కిషన్, చంద్ర దంపతులకు సంబందించిన ఓ వ్యక్తి అర్థ రాత్రి వచ్చి తన గది తలుపులు తట్టాడని పేర్కొంది. అతడు మాట్లాడేది నాకు అర్థ కాదు అనుకున్నాడేమో.. కానీ తనకు తెలుగు అర్థం అవుతుందని పూనమ్ పేర్కొంది. ఆ సమయంలో అతడి చెంప పగల గొట్టానని తెలిపింది.

వాళ్ళు చేసే పనులు

వాళ్ళు చేసే పనులు

ఆ సమయంలో తాను ఓ సంస్థ కోసం అమెరికా వెళ్లానని పూనమ్ కౌర్ తెలిపింది. తాను ఒంటరిగానే ఉన్నానని పూనమ్ కౌర్ తెలిపింది. అమాయకమైన అమ్మాయిలే వారి టార్గెట్ అని పూనమ్ పేర్కొంది. ధనం ద్వారా లేదా భయ పెట్టి అయినా లొంగదీసుకుంటారని తెలిపింది.

 నీచ పనుల కోసమే ఆ ముసుగు

నీచ పనుల కోసమే ఆ ముసుగు

వాస్తవానికి కిషన్, చంద్ర దంపతులు కాదని పేర్కొంది. ఇలాంటి నేరాలు చేయడానికి వారు వేసుకున్న ముసుగు మాత్రమే అది అని పూనమ్ తెలిపింది.

మోడీగారు కాపాడండి

మోడీగారు కాపాడండి

ఈ సందర్భంగా అమెరికాలో ఇలా మోసపోతున్న మన అమ్మాయిలని కాపాడండి మోడీగారు అంటూ పూనమ్ కౌర్ ప్రధానిని కోరింది.

మీపైనే ఆశలు

మీపైనే ఆశలు

ప్రధాని మోడీతో పాటు అమెరికాలో ప్రఖ్యాత మీడియా పర్సనాలిటీ ఓప్రా విన్ ఫ్రెయి, మాజీ అధ్యక్షుడు ఒబామా, మిషెల్ ఒబామాకి వేడుకుంటూ మీరే మా ఆశ అంటూ పూనమ్ కౌర్ పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X