twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Poonam Kaur: హీరోయిన్ కి అరుదైన వ్యాధి.. కేరళలో చికిత్స.. దాని లక్షణాలు ఏంటంటే?

    |

    టాలీవుడ్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటి పూనమ్ కౌర్. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హైదరాబాద్ బ్యూటీ ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, గణేష్, వినాయకుడు, శ్రీనివాస కల్యాణం వంటి తదితర చిత్రాల్లో నటించింది. మొత్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి సుమారు 24కుపైగా చిత్రాల్లో నటించింది ఈ బ్యూటి. అయితే ఈ భామ తాజాగా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కేరళలో చికిత్స తీసుకుంటున్న పూనమ్ కౌర్ ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

    2005లో మిస్ ఆంధ్రా టైటిల్..

    2005లో మిస్ ఆంధ్రా టైటిల్..

    పంజాబీకి చెందిన సరబ్ జిత్ సింగ్, నిజామాబాద్ కు చెందిన సుఖ్ ప్రీత్ దంపతులకు హైదరాబాద్ లో జన్మించింది బ్యూటిఫుల్ పూనమ్ కౌర్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన పూనమ్ కౌర్ ఆ తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసింది. 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్ కౌర్ కు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటించే అవకాశం లభించింది.

    మూడు భాషల్లో దాదాపుగా 24 సినిమాల్లో..

    మూడు భాషల్లో దాదాపుగా 24 సినిమాల్లో..

    మోడలింగ్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పూనమ్ కౌర్ 2006లో మాయాజాలం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇందులో తనదైన నటన, క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంది ఈ బ్యూటి. అనంతరం తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లో కలిపి దాదాపుగా 24 సినిమాల్లో నటించింది. అందులో ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్, వినాయకుడు, నాగవల్లి, పయనం, గగనం వంటి అనేక చిత్రాల్లో నటించింది.

    గోపీచంద్ కి చెల్లెలిగా..

    గోపీచంద్ కి చెల్లెలిగా..

    హీరోయిన్ గానే కాకుండా పలు సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది పూనమ్ కౌర్. ఇందులో భాగంగానే గోపీచంద్ సూపర్ హిట్ మూవీ శౌర్యంలో అతనికి చెల్లెలుగా యాక్ట్ చేసి ఆకట్టుకుంది. చివరిగా 2018లో 3 దేవ్ అనే హిందీ చిత్రంలో రాధ పాత్ర పోషించింది. అయితే సినిమాలతో ఎక్కువగా పాపులారిటీ పొందని పూనమ్ కౌర్ సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. పలు విషయాలపై, అంశాలపై తన ట్విటర్, ఇన్ స్టా అకౌంట్స్ ద్వారా స్పందిస్తూ హైలెట్ అయింది.

    వ్యాధితో రెండేళ్లుగా..

    వ్యాధితో రెండేళ్లుగా..

    నిత్యావసర వస్తువుల ధరల పెంపు, మహిళను కించపరిచేలా మాట్లాడటం వంటి పలు సామాజిక అంశాలపై తనదైన శైలీలో గొంతెత్తుంది. అయితే ఇప్పుడు పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. 'ఫిబ్రో మయాల్జియా' (Fibromyalgia) అనే వ్యాధితో పూనమ్ కౌర్.. రెండేళ్లుగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, నిద్ర లేకపోవడం, త్వరగా అలసిపోవడం, కండరాల నొప్పి, మానసిక ఒత్తిడి వంటి ఇబ్బందులను పూనమ్ ఎదుర్కొంటుందట.

    ఫొటోలు బయటకురావడంతో..

    ఫొటోలు బయటకురావడంతో..

    పూనమ్ కౌర్ 'ఫిభ్రో మయాల్జియా' వ్యాధి నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకుంది. అయితే ఆ ట్రీట్మెంట్ తో ఆ వ్యాధి నయం కాలేదు. దీంతో ఆమె ఇప్పుడు కేరళలో చికిత్స తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే రెండేళ్లపాటు తను ఎదుర్కొంటున్న ఫిబ్రో మయాల్జియా గురించి పూనమ్ ఎప్పుడూ బయటపెట్టలేదు. ప్రస్తుతం కేరళలో పూనమ్ చికిత్స తీసుకుంటున్న ఫొటోలు బయటపడటంతో ఈ విషయం తెలిసింది.

    చేయి పట్టుకుని నడవటంతో..

    చేయి పట్టుకుని నడవటంతో..

    అయితే పూనమ్ కౌర్ ఫిబ్రో మయాల్జియా వ్యాధి చికిత్స కోసం ముందుగా పలు హాస్పిటల్స్, వైద్యులను సంప్రదించిందట. చికిత్స కూడా తీసుకుందట. అయినా నయం కాకపోవడంతో.. ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి చెందిన కేరళలో చికిత్స తీసుకుంటుంది పూనమ్ కౌర్. ఇదిలా ఉంటే ఇటీవల కాంగ్రెస్ నేత చేసిన భారత్ జోడో యాత్రలో పూనమ్ కౌర్ పాల్గొంది. అప్పుడు రాహుల్ గాంధీ చేయి పట్టుకుని పూనమ్ నడిచిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

    English summary
    Poonam Kaur Diagnosis Fibromyalgia Disease From Two Years And Taking Treatment In Kerala. And Here Is The Fibromyalgia Characteristics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X