»   » లవ్ పాయిజన్, పూనమ్ బాయ్‌ఫ్రెండ్ ఎవరంటే?(ఫోటోలు)

లవ్ పాయిజన్, పూనమ్ బాయ్‌ఫ్రెండ్ ఎవరంటే?(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగులూరు: బాలీవుడ్ హాట్ లేడీ పూనమ్ పాండే ఇటీవల 'నషా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే పూనమ్ తొలి ప్రయత్నం విఫలమైంది. ఆమె ఎంత రెచ్చిపోయినా అందాలు ఆరబోసినా, శృంగార సీన్లు ఇరగదీసినా సినిమా బాక్సాఫీసు వద్ద సత్తాచాటలేక పోయింది.

దీంతో పూనమ్ పాండే ఐటం సాంగుల వైపు తన రూటు మార్చింది. ప్రస్తుతం కన్నడ మూవీ 'లవ్ ఈజ్ పాయిజన్'లో ఐటం సాంగు చేస్తోంది. ఈ సందర్భంగా పూనమ్ మీడియాతో మాట్లాడుతూ 'ఇంతకాలం అభిమానులు నన్ను బికినీలో చూసారు. కానీ ఇప్పుడు నేను వేసుకున్న కాస్ట్యూమ్ 10 కేజీల బరువుంది' అని తెలిపారు.

ప్రస్తుతం పూనమ్ పాండేపై చిత్రీకరిస్తున్న ఐటం సాంగు దాబా సెట్లో చిత్రీకరిస్తున్నారు. హీరో, అతని స్నేహితులు హోరో లవ్ లైఫ్ సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో వచ్చే సాంగులో పూనమ్ కనిపిస్తుంది. 'ముందు సెట్ చూసి నర్వెస్ అయ్యాను. కానీ ఇక్కడ అంతా ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. అందరూ మంచి వారే. చాలా కంఫర్ట్ గా ఫీలయ్యాను. ఈ సినిమాలో చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అని చెప్పింది పూనమ్.

స్లైడ్ షోలో మరిన్న వివరాలు.....

వివాదాలపై పూనమ్ పాండే

వివాదాలపై పూనమ్ పాండే

పూనమ్ పాండే అంటేనే వివాదాలకు మారుపేరు. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా స్పందిస్తూ...‘నేనేంటో నాకు తెలుసు. ఇతరుల కోసం నా లైఫ్ స్టైల్ మార్చుకోవడం ఇష్టం ఉండదు' అని సమాధానం ఇచ్చారు.

పూనమ్ లైఫ్ స్టైల్

పూనమ్ లైఫ్ స్టైల్


‘ప్రస్తుతం ఉన్న నా లైఫ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఏది చేసినా ఇష్టపడే చేస్తాను. ఏది తప్పు...ఏది ఒప్పు నాకు తెలుసు' అని చెప్పింది.

మీడియా, అభిమానులతో ఇంటరాక్ట్

మీడియా, అభిమానులతో ఇంటరాక్ట్


మీడియాతో, అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం తనకెంతో ఇష్టమని అంటోంది పూనమ్. సోషల్ పర్సన్‌గా నా గురించి వారికి తెలియజేయడం ఇష్టమని చెబుతోంది పూనమ్.

కెమెరానే పూనమ్ బాయ్ ఫ్రెండ్

కెమెరానే పూనమ్ బాయ్ ఫ్రెండ్


‘నాకు కెమెరా అంటే ఎంతో ఇష్టం. కెమెరా కనిపిస్తే ఎంతో యాక్టివ్‌గా మారిపోతాను. కెమెరా నాకు బాయ్ ఫెండుతో సమానం. ఐలవ్ కెమరా' అని పూనమ్ పాండే చెప్పుకొచ్చింది.

కాంపిటీషన్ లేదు

కాంపిటీషన్ లేదు

సినిమా ఇండస్ట్రీలో తనకు కాంపిటీటర్స్ అంటూ ఎవరూ లేరు....ఎలాంటి అవకాశాలు వచ్చినా చేయడానికి నేను రెడీ అని అంటోంది పూనమ్ పాండే.

బెంగులూరు సిటీ అంటే ఇష్టం

బెంగులూరు సిటీ అంటే ఇష్టం


సినిమా షూటింగులో భాగంగా బెంగులూరు వచ్చిన పూనమ్ పాండే మాట్లాడుతూ...‘నాకు బెంగులూరు సిటీ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ముఖ్యంగా సిటీలో వాల్ పేయింటింగ్స్ చాలా బాగుంటాయి. కానీ ముంబైలో ఇలా ఉండదు' అని పూనమ్ చెబుతోంది.

లవ్ ఈజ్ పాయిజన్

లవ్ ఈజ్ పాయిజన్


లవ్ పాయిజన్ చిత్రంలో కన్నడ నటుడు రాజేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నంద ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
It is a known fact that Bollywood actress and model Poonam Pandey is making her debut in Kannada film industry. The actress has been roped in to play an item number in the forthcoming movie Love Is Poison.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu