»   » మహేష్, ఎన్టీఆరే ఉదాహరణ: ఇండస్ట్రీలో హీరోల బిహేవియర్ మీద పోసాని కామెంట్!

మహేష్, ఎన్టీఆరే ఉదాహరణ: ఇండస్ట్రీలో హీరోల బిహేవియర్ మీద పోసాని కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా పరిశ్రమ హీరోల్లో 90 శాతం గుడ్ పీపుల్ ఉన్నారని ప్రముఖ నటుడు పోసాని అన్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ... ఉదాహరణగా మహేష్ బాబు, ఎన్టీఆర్ గురించి రెండు ముక్కలు మాట్లాడారు.

మహేష్ బాబు హీరో కృష్ణ గారు ఎలా ఉంటారో? అలాంటి ప్రవర్తనే మహేష్ బాబులో కనిపిస్తుంది. ఎవరి గురించి బ్యాడ్ గా మాట్లాడడు, పక్కోడు నాశనం కావాలనికోరుకోడు. మహేష్ బాబు అహంకారంగా మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు అని పోసాని వ్యాఖ్యానించారు.

మహేష్ బాబు గుడ్ బోయ్

మహేష్ బాబు గుడ్ బోయ్

మహేష్ బాబు సెట్లోకి.... నేనే రాజు అనే ఫీలింగుతో ఎప్పుడూ రాలేదు. నేనొస్తే ఎదుటోడు లేచి నిలబడాలి అనుకోడు. వచ్చి ఒక ఆర్టిస్టు ఎలా ఉంటాడో, అలాగే ఒక కుర్చీ వేసుకుని మూలన కూర్చుంటాడు. తన కూర్చుంటే ఎదుట ఇంకోడు కూర్చోకూడదు అనే ధోరణి ఉండదు. తన ఎదుట జూనియర్ ఆర్టిస్టు కూర్చున్నా పట్టించుకోడు. గుడ్ బాయ్ అంటూ పోసాని వ్యాఖ్యానించారు.

AR Murugadoss, Mahesh Babu film is super hot overseas | Telugu Filmibeat
ఎన్టీఆర్ గురించి

ఎన్టీఆర్ గురించి

ఎన్టీఆర్‌కు అహంకారం ఉండదు, ఫోజులు ఉండవు, నేను బాగా యాక్ట్ చేస్తే వచ్చి గట్టిగా వాటేసుకుంటాడు. బాగా చేయలేదు అంటే.... అన్నా నువ్వు ఇలాగ చేస్తే బావుంటుంది అని చెబుతాడు.
వాళ్లకు దేవుడు అన్ని ఇచ్చాడు. డబ్బు ఇచ్చాడు, అందం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. స్టేటస్ ఇచ్చాడు. ప్రజాభిమానం ఇచ్చాడు. ఇంత ఉన్నపుడు వారు అహంకారంగా ఉండాల్సిన అవసరం లేదు అని పోసాని అన్నారు.

అహంకారం ఉంటే నాశనమే

అహంకారం ఉంటే నాశనమే

అహంకారం ఉంటే నాశనం అయిపోతారు. అలాంటి వారు ఒకరిద్దరు ఉంటారు. పొలంలో మీరు ఎన్ని పంటలు వేయండి కలుపు మొక్కలు పుడుతూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటి కలుపు మొక్కులు ఉంటాయి. అలాంటి కలుపు మొక్కలను పట్టించుకోకూడదు. మేజర్ గా మన హీరోలు ఎలా ఉన్నారు, నిర్మాతలు, దర్శకులు గుడ్ పీపుల్ ఉన్నారా? లేదా? అనేదే ముఖ్యం అని పోసాని అన్నారు.

కొందరుంటారు

కొందరుంటారు

కొంత మంది అప్పటి వరకు మామూలుగా ఉంటారు. అపుడు పక్కన ఏమీ ఉండవు. సడెన్‌గా హీరో అవ్వగానే అసిస్టెంట్, మేకప్, టచ్చప్, కాస్టూమ్ డిజైన్, ప్రొడ్యూసర్. వారంతా వచ్చి
బాబూ బాబూ అంటుంటే వీడు నేను చాలా పెద్దయ్యాను అని పీలవుతాడు. ఫోజులు కొడతారు... అని పోసాని ఇండస్ట్రీలోని పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేశారు.

English summary
Tollywood actor Posani Krishna Murali comments On Heros Behaviour in Telugu Film industry. "Like Mahesh Babu and NTR... so many good people in the industry, "Posani said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X