Just In
- 7 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 15 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 56 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
మహ్మద్ సిరాజ్కు నాతో చీవాట్లు తినడం ఇష్టం: టీమిండియా బౌలింగ్ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జగన్ విషయంలో సినీ ఇండస్ట్రీని అలా అనడం తప్పు: పృథ్వికి పోసాని కౌంటర్
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ముందు నుంచే ప్రచారం హోరెత్తించారు సినీ నటులు పోసాని కృష్ణ మరళి, పృథ్వి రాజ్. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి రావడానికి తమ వంతు తోడ్పాటు అందించారు. మొన్నటి వరకు జగన్ విషయంలో ఒకే మాటపై ఉన్న ఈ ఇద్దరు సినీయర్ స్టార్స్.... తాజాగా ఓ విషయంలో విబేధించారు.
ఇటీవల ఎస్వీబీసీ పృథ్వి మీడియాతో మాట్లాడుతూ... సినీ ఇండస్ట్రీపై కొన్ని కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలకు జగన్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదని, పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడటానికి ఎవరూ కొత్త సీఎం వద్దు వెళ్లడం లేదని, కనీసం అభినందించడం కూడా చేయడం లేదని మండి పడ్డారు.

ఆ స్థానంలో ఎవరు ఉన్నా వెళ్లాలి, కానీ ఇలా చేస్తున్నారేంటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో ఏ వ్యక్తి ఉన్నా... అది జగన్మోహన్ రెడ్డి అయినా, మరెవరైనా సినీ రంగానికి చెందిన వారంతా సీఎం వద్దకు వెళ్లి పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడాలి, 24 క్రాఫ్ట్స్ బోగోగుల గురించి, అభివృద్ది గురించి మాట్లాడాలి, కానీ జగన్ సీఎం అయిన తర్వా ఎవరూ అలా చేయడం లేదని పృథ్వి అసంతృప్తి వ్యక్తం చేశారు.

జగన్ సీఎం కావడం వారికి ఇష్టం లేదేమో?
ప్రజలంతా ఇన్ని సీట్లు వచ్చాయి, ఇది అద్భుతమైన విజయం అంటుంటే... సినీ పరిశ్రమకు చెందిన కొందరు ఎలా గెలిచారయ్యా? అన్ని ఓట్లు ఎలా పడ్డాయో? అనడం మొదలు పెట్టారు. ప్రజల నాడి తెలుసుకుని, అంత పెద్ద పాదయాత్ర చేసి వారి కష్టాలు తెలుసుకున్నారు కాబట్టే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. సినీ పరిశ్రమలో చాలా మందికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదేమో? అందుకే ఇలా మాట్లాడుతున్నారని పృథ్వి వ్యాఖ్యానించారు.
చనిపోతానని భయపడ్డా.. ఆయన లేకపోతే శాల్తీ గల్లంతే.. పోసాని

పృథ్వి ఆ మాట అనడం తప్పే అంటున్న పోసాని
అయితే పృథ్వి చేసిన కామెంట్లను పోసాని కృష్ణ మురళి తప్పబట్టారు. పృథ్వి నాకు చాలా కావాల్సిన మనిషి, నా స్నేహితుడు, నా శ్రేయస్సు కోరేవాడు. సినీ ఇండస్ట్రీ గురించి ఆయన అన్నమాట తొందరపడి అన్నమాటే. సినిమా ఇండస్ట్రీ పెద్దలకు జగన్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదు అనేది వంద శాతం బిగ్ మిస్టేక్.... అని పోసారి కౌంటర్ ఇచ్చారు.

పృథ్వి గారికి ఆ విషయం తెలియదేమో?
జగన్మోహన్ రెడ్డిగారి వద్దకు వెళ్లి, పెద్ద దండేసి, అభినందిస్తేనే ఆయనపై ప్రేమ, గౌరవం ఉన్నట్లు కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గెలిచారు. నేను వళ్లలేదు, ఎలాంటి దండ వేయలేదు. అంటే ఆయన ముఖ్యమంత్రి కావడం నాకు ఇష్టం లేదనా? సీఎం గారి ఆఫీసుకు నుంచి మెసేజ్ ఉంది. అది అందరు పెద్దలకు తెలుసు. దురదృష్ట వశాత్తు అది పృథ్వి గారికి తెలియకపోవచ్చు.

పృథ్వి గారు నన్ను క్షమించాలి, మీరు తొందర పడ్డారు
సురేష్ బాబు గారు జగన్ గురించి మాట్లాడుతూ యంగ్ డైనమిక్ సీఎం అయ్యారు, రాష్ట్రం గ్రోత్ బావుంటుందని పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. జగన్ గారు ముఖ్యమంత్రి కావడం కొందరికి ఇష్టం లేదు అనడం కరెక్ట్ కాదు. పృథ్వి గారు నన్ను క్షమించాలి. మీరు అది తొందర పడి అన్నమాటే.... అంటూ పోసాని తనదైన శైలిలో స్పందించారు.