For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కేక పుట్టిస్తున్న ‘జంజీర్’ చరణ్, ప్రియాంక జంట (ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' బాలీవుడ్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుందంటున్నారు. జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్.. విజయ్ గా కనిపించనున్నాడు.. మాలాగా ప్రియాంక చోప్రా, తేజగా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో సోనూసూద్(తెలుగు వెర్షన్ కి), సంజయ్ దత్(హిందీ వెర్షన్ కి), మోనాగా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు.

  ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

  రామ్ చరణ్ జంజీర్ గురించి మాట్లాడుతూ..''ఈ సినిమా నాకో సవాల్‌. తప్పకుండా ఈ సినిమాతో అందరి అంచనాలను అందుకొంటాను. బిగ్‌బి పోషించిన పాత్ర నాకు దక్కడం సంతోషంగా ఉంది. నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. రామ్ చరణ్ బాలీవుడ్ కి కొత్త వాడు కావటంతో అన్ని రకాలుగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.'' అని చెప్పారు.

  రామ్ చరణ్, ప్రియాంక చోప్రా ఈ జంట ఖచ్చితంగా 2013లో హాట్ పెయిర్ గా నిలుస్తుందని బాలీవుడ్ లో అప్పుడే అంచనాలు మొదలయ్యాయి.

  వాస్తవానికి మొదటి నుంచి జంజీర్ లుక్ ని మీడియాకు రిలీజ్ చేయలేదు. కానీ ప్రేక్షకులలో ఉండే ఆసక్తిని గమనించి ఓ ఇంగ్లీష్ డైలీ ఈ ఫోటోని సంపాదించి రిలీజ్ చేసింది. ఈ ఫోటోకి వచ్చిన రెస్పాన్స్ అమోఘం. మసకమసకగా ఉన్న ఈ ఫోటో ఎంతోమంది దృష్టిని ఆకర్షించింది. చిత్రంలో రామ్ చరణ్ లుక్ ఇదే అని తేల్చి చెప్పింది.

  రామ్ చరణ్ పోలీస్ అధికారిగా తొలిసారిగా కనిపిస్తున్నారు. అమితాబ్ ని బీట్ అవుట్ చేయగలరో లేదో కానీ తనకంటూ ఓ మార్క్ వేసుకుంటారని మెగాభిమానులు నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.

  రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, దర్శకుడు అపూర్వ లఖియా... ముగ్గురూ ప్రెండ్స్ లా కలిసిపోయి... చిత్రం సూపర్ హిట్ కి అహర్నిశలూ కష్టపడుతున్నారు.

  జంజీర్ టీమ్ కి ఉత్సాహాన్ని ఇచ్చేందుకు మెగాస్టార్ ఓ రోజు జంజీర్ సెట్ లో వాలిపోయి.. విషెష్ చెప్పారు... అప్పటి ఫోటో ఇది. అయితే చిరంజీవి తెలుగు వెర్షన్ లో గెస్ట్ రోల్ చేస్తున్నారని వినికిడి.

  ఓ కొత్త హీరో ప్రక్కన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రానా చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యమే రాబోయే రోజుల్లో భారీ వసూళ్లకు, ఓపినింగ్స్ కు నాంది.

  మరో ప్రక్క ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఈచిత్రాన్ని ఏప్రిల్ 12, 2013లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు.

  English summary
  Ram Charan Teja's debut Bollywood movie Zanjeer, which is also simultaneously made in Telugu, is one of the much-talked about film in India. The makers of the movie have strictly guarded the first look of Cherry in this flick. But a picture of the movie featuring Cherry walking in a station in police getup, has made to the internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X