»   » పవన తనయుడు: నాలుగోసారి తండ్రి అయిన పవర్ స్టార్, ఆనందంలో అభిమానులు

పవన తనయుడు: నాలుగోసారి తండ్రి అయిన పవర్ స్టార్, ఆనందంలో అభిమానులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan Third Wife Anna Lezhneva Blessed With Baby Boy

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి అయ్యార్డు. మూడోభార్యకి రెండోకాన్పులో మగబిడ్డ పుట్టటం తో ఆ పసివాన్ని చేతుల్లోకి తీసుకొని మురిసి పోతున్నాడు పవర్ స్టార్. విశాఖలో సత్యానంద్ దగ్గర యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు... పవన్ కు నందిని పరిచయమైంది. అలా మొదలైన వారి పరిచయం... పెళ్లి వరకు వెళ్లి చివరకు విడాకులతో ముగిసింది.

రేణూ దేశాయ్

రేణూ దేశాయ్

అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం రేకెత్తించింది. వీరిద్దరి వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అనంతరం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం బద్రి సినిమాలో నటించిన రేణూ దేశాయ్ తో పీకల్లోతు ప్రేమలో పడిపోయాడు పవర్ స్టార్. వీరిద్దరికీ పెళ్లికాకుండానే అకీరా అనే కుమారుడు కూడా పుట్టాడు.

విడిపోయారు

విడిపోయారు

అనంతరం కొడుకు సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంసారం కొన్నాళ్లు సజావుగా సాగిన తర్వాత... ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. తర్వాత ఇద్దరూ విడిపోయారు. తర్వాత వరుస సినిమాలతో పవన్ బిజీ అయ్యాడు. తీన్ మార్ సినిమా సమయంలో పవన్ మళ్లీ ప్రేమలో పడ్డారు. అన్నా లెజెనోవా అనే విదేశీ నటి, రష్యన్ మోడల్ ని ప్రేమించి చివరకు పెళ్లి చేసుకున్నాడు.

 రష్యా మోడల్ అన్నా లెజెనోవా

రష్యా మోడల్ అన్నా లెజెనోవా

తీన్ మార్ సినిమాలో రష్యా మోడల్ అన్నా లెజెనోవా పవన్ తో కలిసి పనిచేసింది. ఈ పరిచయం ప్రేమ వరకు వెళ్లి చివరకు పెళ్లితో ముగిసింది. ఇది పవన్ కు మూడో పెళ్లి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్ నోవా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్‌తో వివాహానంతరం వీరికి అకీరా, ఆధ్య జన్మించారు. అనంతరం రేణుతో విడిపోయాక పవన్ రష్యాకు చెందిన అన్నాను వివాహం చేసుకున్నాదు.

పొలెనా అనే పాప

పొలెనా అనే పాప

వీరిద్దరికీ ఇంతకు మునుపే పొలెనా అనే పాప ఉంది. ఇప్పుడు బాబు పుట్టాడు. హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో అన్నా లెజొనెవాకు కాన్పు జరిగింది. ఆసుపత్రిలో బాబును ఎత్తుకుని మురిపెంగా చూస్తున్న పవన్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. తమ ఇంటికి మరో చిన్నారి రాకతో పవన్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు.

ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు

ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు

ఇక పవన్ సంగతేమో గానీ ఆయన అభిమానులు మాత్రం మరీ అనందం లో మునిగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఎత్తుకున్న ఫొటోని షేర్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అసలే పవన్ మామూలు ఆనందం లో ఉంటేనే ఫ్యాన్స్ ని పట్టలేం ఇక ఇప్పుడైతే ఈ ఫ్యాన్స్ సంబరాలు మామూలుగా లేవు.

English summary
power star pawan kalyan third wife anna lezhneva Blessed with baby boy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X