twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మిర్చి'లో పాత సినిమాల ఛాయలపై ప్రభాస్ క్లారిఫికేషన్

    By Srikanya
    |

    హైదరాబాద్: ''కమర్షియల్‌ సినిమాల్లో ఇవన్నీ తప్పవు. మూడేళ్లకు ఒక్క సినిమా చేస్తే... కొత్త కథలు ఆశించొచ్చు. సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తుంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. పూర్తిగా కొత్త కథే ఉండాలంటే సమాంతర సినిమాలు చేయాలి. నేను వాటికి దూరం. కేవలం వాణిజ్యపరమైన సినిమాలే చేస్తాను అంటూ వివరణ ఇచ్చారు ప్రభాస్. 'మిర్చి'లో కొన్ని పాత సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి కదా? అనే మీడియా వారి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇలా స్పందించారు.

    అలాగే... ఘన విజయం సాధించిన ఏ సినిమా అయినా తీసుకోండి. అందులోనూ కొన్ని సినిమాల ప్రభావం కనిపిస్తుంది. 'వర్షం' కూడా ఇందుకు మినహాయింపు కాదు. నాయకానాయికలు కలుసుకోవడం, వారి మధ్య ప్రేమ పుట్టడం మామూలే. కానీ వర్షం నేపథ్యంగా తీసుకొన్నాం. అందుకే కొత్తగా అనిపించింది. 'మిర్చి'లోనూ కొత్త తరహా సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అందుకే ఆడుతోంది. అలా కలవకుండా పూర్తిగా కొత్త కథతో సినిమా తీయాలంటే హాలీవుడ్‌లోలా మూడేళ్లకు ఓ సినిమా చెయ్యాలి.
    '' అన్నారు ప్రభాస్

    రికార్డుల గురించి మాట్లాడుతూ...''నా సినిమా ఎంత వసూలు చేసింది? అనేది నేనూ తెలుసుకొంటా. కానీ పక్కవాళ్ల సినిమాల గురించి ఆలోచించను. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఎక్కడుంది? అనేదే ముఖ్యం. పరాజయాలను తేలిగ్గా తీసుకోను. ఇక నెంబర్‌ వన్‌ అంటారా..? అది ఎలా నిర్ణయిస్తారో నాకు తెలీదు. వరుసగా నాలుగైదు విజయాలు సాధించినా నేను నెంబర్‌ వన్‌ కాదు. ముఖ్యంగా ఇతర హీరోల చిత్రాల రికార్డ్స్‌ని నా చిత్రం అధిగమించాలని కోరుకోను. నా సినిమా బాగా ఆడి, నిర్మాతకు నాలుగు డబ్బులొస్తే ఆనందంగా ఉంటుంది. నైజాం ఏరియాలో నాకు మంచి మార్కెట్ ఉందని సన్నిహితులు చెబుతుంటారు. అలాంటి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. అలాగే ఇతర ఏరియాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా 'మిర్చి' బాగా కలక్ట్ చేస్తోంది. ఈ సినిమాకి వద్దంటున్నా నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారు. అందుకని సినిమా విజయవంతంగా కొనసాగడం హ్యాపీగా ఉంది అన్నారు.

    పెళ్లి గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. నాకు పెళ్లి కుదిరిందని బయట కొందరు చెబుతున్నారని విన్నా. వాటిలో నిజం లేదు. బహుశా వచ్చే యేడాది పెళ్లి చేసుకొంటానేమో..?'' అని తేల్చి చెప్పారు. నంబర్ గేమ్‌ని నమ్మను. నంబర్ వన్ అంటే ఏంటి? ఏ హీరో అయితే కంటిన్యూస్‌గా పదేళ్లు జయాపజయాలతో సంబంధం లేకుండా స్టడీగా నిలదొక్కుకుంటాడో ఆ హీరోయే నంబర్ వన్ అన్నది నా ఫీలింగ్. అందుకని నేను ఆ స్థానం గురించి ఆలోచించను. నా సినిమా హిట్ అయితే చాలనుకుంటాను. కథ కుదిరితే ఏ హీరోతో అయినా మల్టీస్టారర్ మూవీ చేయడానికి రెడీ అన్నారు.

    English summary
    Prabhas clarifies... This is a commercial cinema. Any big commercial cinema with entertainment as primary motive will have a few references to other stories. That is not a problem in my book, as long as there is something new in terms of screenplay or presentation. If you want all films to have totally fresh stories, we must make one film every 3 years like Mr. Aamir Khan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X