»   » కరణ్ జోహార్ నిర్ణయంతో షాకయ్యాను, కేవలం గుడ్లే తిన్నా‌: ప్రభాస్

కరణ్ జోహార్ నిర్ణయంతో షాకయ్యాను, కేవలం గుడ్లే తిన్నా‌: ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘బాహుబలి' ప్రమోషన్లలో భాగంగా ముంబైలో బిజీగా గడుపుతున్నాడు ఈ సందర్భంగా ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. బాహుబలి చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్న కరణ్ జోహార్ గురించి ప్రభాస్ మాట్లాడారు.

‘బాహుబలి సినిమా నిర్మాణంలోకి కరణ్ జోహార్ కూడా వస్తున్నారని రానా నాకు చెప్పగానే షాకయ్యాను. ఈ విషయం నా స్నేహితులకు, ఫ్యామిలీ మెుంబర్స్ కు చెబితే.... ఆయనెందుకు సౌత్ సినిమాల్లోకి వస్తారు? అలాంటి అవకాశమే లేదన్నారు. ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో ఆయన ప్రముఖుడు. మా సినిమా గ్రాండ్‌గా, గ్రేట్ విజువల్ ఎఫెక్టులతో తెరకెక్కుతుంది. కానీ కరణ్ జోహార్ ఈ ప్రాజెక్టులో లేకుంటే బాలీవుడ్లో మాపై ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదు' అన్నారు ప్రభాస్.


Prabhas about Karan Johar

సినిమా షూటింగ్ సమయంలో తన ట్రైనింగ్, ఫుడ్ విశేషాల గురించి వెల్లడిస్తూ...‘బాహుబలి' చాలా పెద్ద ప్రాజెక్టు. రాజమౌళి చెప్పగానే ఓకే చెప్పాను. ఎన్ని డేట్స్ ఇవ్వడానికైనా సిద్ధమని చెప్పాను. సినిమా సమయంలో చాలా కష్టపడ్డాం. యాక్షన్ సీక్వెన్సెస్ సపరేటుగా, నాతో షాట్లు సపరేటుగా తీసారు. 220 రోజులకు పైనే సమయం పట్టింది. షూటింగ్ మొదలు కావడానికి ముందు రాక్ క్లైంబింగ్, హార్స్ రైడింగ్, కిక్ బాక్సింగ్ లో ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాం. వియత్నాం నుండి కొందరు ఎక్స్ పర్ట్స్ వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఓ కొండపై నుండి జలపాతంలోకి దూకే సన్నివేశం 25 రోజులు చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో కూడా మార్షల్ ఆర్ట్స్, కత్తి ఫైటింగ్ రోజూ ఐదారు గంటలు సాధన చేసే వాళ్లం అని ప్రభాస్ తెలిపారు. 


అమరేంద్ర బాహుబలి, శివుడు ఇలా రెండు పాత్రల్లో తండ్రి కొడుకులుగా కనిపిస్తాను. రెండు పాత్రల్లో వైవిద్యం చూపడానికి చాలా కష్టడ్డాను. పాత్రలకు తగిన విధంగా శరీర సౌష్టవం కోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆహార నియమాల్లో మార్పులు చేసాం. ఒక్కోసారి నెల రోజుల పాటు కేవలం గుడ్లే ఆహారంగా తీసుకున్న సందర్భాలున్నాయి. గతంలో రాజమౌళితో నేను చేసి చత్రపతి కంటే బాహుబలి పదివేల రెట్లు గొప్పగా ఉంటుంది అన్నారు.

English summary
“When Rana told me that Karan Johar is producing Baahubali, I was shocked. He is the biggest name in entertainment in the country. Our film has a grand scale and great visuals, but without Karan we wouldn’t have made such an impact in Bollywood,” Prabhas says.
Please Wait while comments are loading...