»   » మళ్లీ సిక్స్ ప్యాక్‌తో ప్రభాస్.. సాహో కోసం కసరత్తులు..

మళ్లీ సిక్స్ ప్యాక్‌తో ప్రభాస్.. సాహో కోసం కసరత్తులు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ అమాంతం జాతీయ స్థాయికి చేరుకొన్నది. దీంతో ప్రభాస్ తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అంచనాలకు తగినట్టుగానే ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌లో రూపొందుతున్న సాహో చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోసారి ప్రభాస్ సిక్స్‌ప్యాక్‌లో

మరోసారి ప్రభాస్ సిక్స్‌ప్యాక్‌లో

సాహో చిత్రంలో మరోసారి ప్రభాస్ సిక్స్ ప్యాక్ లుక్ అభిమానులను అలరించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. బాహుబలి మొదటి భాగంలో సిక్స్ ప్యాక్‌లో కనిపించిన ప్రభాస్ సాహో కోసం ఆ ప్రయత్నాన్ని చేస్తున్నట్టు సమాచారం. సిక్స్ పాక్స్ తో కనిపించడానికి ప్రభాస్ కసరత్తులు చేస్తున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.

సాహోలో కండల ప్రదర్శన

సాహోలో కండల ప్రదర్శన

యాక్షన్ ప్రధానంగా సాహో చిత్రం తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ కండల ప్రదర్శన చేయనున్నట్లు తెలుస్తున్నది. గతంలో బాహుబలి కోసం శరీర బరువును పెరిగిన ప్రభాస్ ఈ చిత్రం కోసం బరువు తగ్గి నాజుకుగా కనిపిస్తున్నాడు. ఇటీవల మీసాలు తీసి అభిమానులకు షాక్ ఇచ్చారు కూడా.

సాహో మొదలైంది..

సాహో మొదలైంది..

అమెరికాలో వెకేషన్ వెళ్లి తిరిగి వచ్చిన ప్రభాస్ ఇటీవలనే సాహో చిత్రంపై దృష్టిపెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ చిత్రంలో విలన్‌గా కనిపించే నీల్ నితిన్ ముఖేష్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా నటించే హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే.

త్వరలో బాలీవుడ్ చిత్రంలో..

త్వరలో బాలీవుడ్ చిత్రంలో..

ఇదిలా ఉండా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడనే వార్త ప్రచారంలో ఉంది. అలాగే సల్మాన్ ఖాన్‌తో కూడా ఓ చిత్రంలో నటించడానికి అవకాశాలున్నాయనే మాట కూడా బలంగా వినిపిస్తున్నది.

English summary
Young rebel star Prabhas is to appear in six pack body for again for Saaho movie. Earlier Prabhas appeared in six pack for Baahubali part one. Saaho movie is going to be full of action scenes. So he is developing six pack body.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu