»   » షారుక్, సల్మాన్ కంటే ప్రభాస్ గొప్ప.. ఇండియాలో కేవలం అతడొక్కడే.. షాకింగ్ కామెంట్స్

షారుక్, సల్మాన్ కంటే ప్రభాస్ గొప్ప.. ఇండియాలో కేవలం అతడొక్కడే.. షాకింగ్ కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభాస్‌పై భళ్లాల దేవ రానా దగ్గుబాటి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా పరిశ్రమలో సూపర్‌స్టార్లుగా గుర్తింపు పొందిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్‌ కంటే ప్రభాస్ పెద్ద యాక్షన్ హీరో అని వారు పేర్కొన్నారు. బాహుబలి2 ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల రాజమౌళి, ప్రభాస్, రానా, సెంథిల్ కుమార్ ముంబైకి వెళ్లారు. ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రానా, సెంథిల్ కుమార్ మాట్లాడారు.

ప్రభాస్ మాత్రమే సూపర్‌స్టార్..

ప్రభాస్ మాత్రమే సూపర్‌స్టార్..

బాలీవుడ్‌లో షారుక్, సల్మాన్ కంటే ప్రభాస్ అతి పెద్ద సూపర్‌స్టార్ అని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ అనడం మీడియాను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇండియాలో ఈ రోజున ప్రభాస్ అతిపెద్ద స్థార్. హిందీ పరిశ్రమలో ఏ ఖాన్‌ కంటే కూడా ప్రభాస్ సూపర్‌స్టార్. ప్రభాస్ నటించిన బాహుబలి2 దేశ చరిత్రలో రూ.1000 కోట్లు వసూలు చేసిన చిత్రంగా కానున్నది. అలాంటి సత్తా ఉన్న హీరోతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా నటులందరూ గర్వంగా ఫీలయ్యే వ్యక్తి ప్రభాస్ అని సెంథిల్ అన్నారు.

ముందు గుర్తించలేకపోయాను..

ముందు గుర్తించలేకపోయాను..

షూటింగ్‌లో ఎదురైన తన అనుభవాలను సెంథిల్ పంచుకొన్నారు. బాహుబలి2 కోసం ప్రభాస్‌ను కలుసుకొన్నప్పడు ఆయనలో ఇంత పెద్ద స్టార్ ఉన్నాడని గుర్తించలేకపోయాను. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఏ హీరోకు కూడా లేరు. నేను ఎంతో మంది సూపర్ స్టార్లతో పనిచేశాను. కానీ ప్రభాస్‌కు ఉన్న మాదిరిగా ఏ హీరోకు ఫ్యాన్స్ లేదనేది స్సష్టమైంది అని సెంథిల్ అన్నాడు.

వంద రెట్లు జనం..

వంద రెట్లు జనం..

ఓసారి కర్నూల్‌లో షూటింగ్ చేస్తుండగా ప్రీరిలీజ్ ఫంక్షన్ హాజరైన జనం కంటే వంద రెట్లు ఎక్కువగా వచ్చారు. దాంతో షూటింగ్ సరిగా చేయడానికి కుదర్లేదు. అప్పుడే నా భార్యకు కాల్ చేసి ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాను అని సెంథిల్ పేర్కొన్నాడు.

అతిపెద్ద యాక్షన్ హీరో..

అతిపెద్ద యాక్షన్ హీరో..

సెంథిల్ మాటలకు రానా మద్దతు పలికాడు. సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ అతి పెద్ద యాక్షన్ హీరో అవతరించాడు. అంత క్రేజ్ ఉన్నప్పటికీ ప్రభాస్ చాలా నిగర్వి. మా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. బాహుబలి కంటే ముందే మూడు నాలుగు భారీ హిట్లు ఆయన కేరిర్‌లో ఉన్నాయి. కేవలం బాహుబలి కోసమే దాదాపు ఐదు సంవత్సరాలు కేటాయించడం మామూలు విషయం కాదు అని రానా అన్నాడు.

రాజమౌళికి అండగా..

రాజమౌళికి అండగా..

బాహుబలి ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడానికి ప్రధాన కారణం రాజమౌళిపై నమ్మకం. ఆయన విజన్ పూర్తిగా అప్పుడే అర్థమైంది. అందుకే ప్రభాస్ ఓ పిల్లర్ మాదిరిగా రాజమౌళి సంకల్పానికి అండగా నిలిచాడు. అందుకే బాహుబలి ఓ సంచలన చిత్రం అయింది. ఇవన్నీ చూసిన తర్వాత నా దృష్టిలో ప్రభాస్ మాత్రమే దేశంలో అతిపెద్ద సూపర్ స్టార్ అని అన్నాడు.

అడ్డుకొన్న ప్రభాస్

అడ్డుకొన్న ప్రభాస్

మీడియా సమావేశంలో రానా, సెంథిల్ ప్రశంసలు కురిపిస్తుండగా ప్రభాస్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వాళ్లు ఏదో ఎక్సైటింగ్‌కు గురై మాట్లాడుతున్నారు. నేను అతిపెద్ద స్టార్ అని చెప్పడం ఎక్కువ అవుతుంది అని ప్రభాస్ అన్నారు.

English summary
Prabhas' Baahubali: The Conclusion co-star Rana Daggubati feels that the actor is a bigger star than Salman Khan and Shah Rukh Khan. Senthil Kumar said, “Prabhas is today, the biggest star of India. He is bigger than any Khan or anyone. His film today will be probably the first film to cross Rs 1000 crore and I am so proud to be associated with him. Such a humble man he is.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu