»   » లగ్జరీ కారు కొన్న ప్రభాస్, ధర రూ. 8 కోట్లు

లగ్జరీ కారు కొన్న ప్రభాస్, ధర రూ. 8 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త లగ్జరీ కారు కొన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కాలర్లలో ఒకటకైన రోల్స్ రాయిస్‌ సిరీస్‌ కి చెందిన ఫాంటమ్ కారు ప్రభాస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు ఖరీదు రూ. 8 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఈ కారు ఇటీవలే ప్రభాస్ కు డెలీవరీ అయినట్లు సమాచారం.

కారు కొన్న సందర్భంగా ప్రభాస్ తన ఫ్రెండ్స్ అందరికీ తన ఫామ్ హౌస్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమాకు ప్రభాస్ భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఆ డబ్బుతోనే ఆయన ఈ కారు కొనుగోలు చేసినట్లు సమాచారం. టాలీవుడ్లో రోల్స్ రాయిస్ కారు ఇప్పటి వరకు చిరంజీవి వద్ద మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆ కారు కొనుగోలు చేసింది ప్రభాస్ మాత్రమే అని అంటున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం ‘బాహుబలి' షూటింగులో బీజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో తెరకెక్కే ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలి సినిమా భారీ విజయం సాధించడంతో రెండో భాగంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Prabhas bought New Rolls Royce Car

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో విడుదలైన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టించింది. గూగుల్‌ సెర్చ్ లో కూడా ఇండియాలో నెం.1 మూవీగా బాహుబలి ప్రథమ స్థానంలో నిలిచింది.

Rolls Royce Phantom

జమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు.... ఇండియన్ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థ ‘ది ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ గైడ్‌' నుండి ప్రశంసలు అందాయి. ఈ మేరకు అధ్యక్షుడు మహేశ్‌ భట్‌ చిత్ర బృందాన్ని అభినందిస్తూ మంగళవారం ఓ ప్రశంసాపత్రాన్ని జారీచేశారు. బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచిందని పేర్కొన్నారు. భారీ ప్రమాణాలతో భారతీయ సినిమా విలువల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు ప్రత్యేకంగా అభినందించారు.

English summary
Prabhas recently fulfilled his dream, bought a brand new Rolls Royce Car Phantom which cost nearly Rs 8 Crore and plans a party with his close friends at his farmhouse which is in the outskirts of Hyderabad.
Please Wait while comments are loading...