»   » అందర్నీ డార్లింగ్ అనే ప్రభాస్.... రాజమౌళి భార్యను ఏమనేవాడో తెలుసా?

అందర్నీ డార్లింగ్ అనే ప్రభాస్.... రాజమౌళి భార్యను ఏమనేవాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ తనకు సన్నిహితంగా ఉండే అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని సంబోధిస్తుంటాడు. అయితే 'బాహుబలి' సినిమాకు డిజైనర్‌గా, స్టైలిస్టుగా పని చేసిన రాజమౌళి భార్య రమారాజమౌళిని మాత్రం అలా పిలిచే వాడు కాదట.

ఇటీవల ఓ ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ ఈ విషయమై స్పందించారు. ప్రభాస్‌ అందర్నీ డార్లింగ్‌...డార్లింగ్‌ అని పిలిస్తే.. నన్ను మాత్రం బంగారం అనేవాడు అని ఆమె తెలిపారు. బాహుబలి సినిమా నిర్మాణంలో అంతా ఓ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయామని ఆమె తెలిపారు.


స్వయంగా వంట చేసే దాన్ని

స్వయంగా వంట చేసే దాన్ని

రోజూ షూటింగ్‌ అయిపోయాగానే అంతా ఓ టెంట్‌ కిందకు చేరుకునేవాళ్లం. రానా వెంటనే నా వద్దకు వచ్చి రమగారూ ఈ రోజు మనం ఏం వండుకుందాం అని అడిగేవాడు. సలాడో, సూపో, జ్యూసో ఇలా ఏదో ఒకటి తయారుచేసేదాన్ని. రోజూ మధ్యాహ్నం కనీసం పాతికమందికి వంటచేసుకుని తీసుకెళ్లేదాన్ని అంతా కలిసే తినేవాళ్లం అని రమ రాజమౌళి తెలిపారు.


రాజమౌళి పనిలో పడితే అంతే

రాజమౌళి పనిలో పడితే అంతే

షూటింగులో బాగా బిజీ అయిపోయాక ఇంటికి వచ్చే తీరిక కూడా ఉండది కాదు. అందుకే కొంతకాలం రామోజీ ఫిల్మ్‌సిటీలోని వసుంధర గెస్ట్‌హౌస్‌లో ఉన్నాం. అప్పుడూ రోజూ వంట నాదే. ఎందుకంటే రాజమౌళి పనిలో పడి తనని తాను మర్చిపోతాడు. బయట తింటే ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టే ఆ జాగ్రత్త తీసుకునేదాన్ని అని రమ తెలిపారు.


రాజమౌళి అప్పట్లో లూజు....నేనే మార్చాను, రమా ఇంకా ఏం చెప్పారంటే!

రాజమౌళి అప్పట్లో లూజు....నేనే మార్చాను, రమా ఇంకా ఏం చెప్పారంటే!

బాహుబలి 2 మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న వేళ యూనిట్ అంతా ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన రమా రాజమౌళి రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి.


సొంత కొడుకు కాదు.... రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

సొంత కొడుకు కాదు.... రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

కార్తికేయ సొంత కొడుకు కాదు...సొంత కొడుకు కాదు.... రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


English summary
"Baahubali actor Prabhas called me as Bangaram" costume designer RamaRajamouli said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu