twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను చేసుకోబోయే అమ్మాయి...: ప్రభాస్

    By Srikanya
    |

    హైదరాబాద్ : నా పెళ్లి గురించి అందరూ అడుగుతున్నారు. నేనూ సీరియస్‌గానే ఆలోచిస్తున్నా. 2014లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. చేసుకోబోయే అమ్మాయి ఉద్యోగం చేసినా ఫర్లేదు, చెయ్యకపోయినా ఫర్లేదు... మంచి అమ్మాయి అయితే చాలు అంటున్నాడు ప్రభాస్. రాజమౌళితో ఆయన చేసే చిత్రం అనంతరం ప్రభాస్ వివాహం ఉండవచ్చని చెప్తున్నారు. త్వరలో మిర్చి రిలీజ్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా పర్శనల్ విషయాలు ముచ్చటించారు.

    అలాగే ఒక సినిమా షూటింగ్‌ మొదలైందంటే అది పూర్తయ్యేంత వరకూ మరో విషయం గురించి ఆలోచించను. దానిమీదే శ్రద్ధపెడతాను. షూటింగ్‌ అయిపోయిందంటే ఆ తరవాత నాకంటే బద్ధకిస్టు మరొకరు ఉండరు. కూర్చున్న చోటినుంచి కదలడానిక్కూడా ఇష్టపడను. సినిమాలు చూస్తూ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోతాను అన్నారు.

    తనపై ప్రభావం చూపించిన పుస్తకం గురించి చెపుతూ... ఓసారి రాజమౌళి 'ద ఫౌంటెయిన్‌ హెడ్‌' చదవమని చెప్పారు. ఆ పుస్తకం నామీద చాలా ప్రభావం చూపింది. నా వ్యక్తిత్వంలో నేను వూహించని కొన్ని మార్పులను తీసుకొచ్చింది అన్నారు. రాజమౌళి తో తను చేయబోయే చిత్రం తన కెరీర్ లో టాప్ స్టాయిలో నిలబడుతుందని ఖచ్చితంగా చెప్పగలను అన్నారు.

    ఇక నేను పరిశ్రమకు వచ్చి పదేళ్లయింది. ఇప్పుడు ప్రభాస్‌ సినిమా అంటే... పిల్లలూ పెద్దలూ యువతా, ఇలా ఇంటిల్లిపాదీ థియేటర్‌కి వెళ్లి హాయిగా చూడొచ్చు అన్న అభిప్రాయం ఏర్పడింది. గత పదేళ్లలో నేను సాధించింది ఇదీ అని గర్వంగా చెప్పుకోగలను. త్వరలోనే 'మిర్చి'తో మీ ముందుకి వస్తున్నా. థియేటర్లలో మళ్లీ కలుద్దాం. హ్యాపీ సంక్రాంతి అని ముగించారు.

    English summary
    Prabhas's new film titled 'Mirchi' under the direction of debutante Koratala Siva is ready to release. Anushka and Richa Gangopadhyaya are playing female lead roles in the movie. V. Vamsi Krishna Reddy and Pramod Uppalapati are producing this film under UV creations banner. Devi Sri Prasad is composing the music for the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X