»   » బాహుబలి-2: ప్రభాస్ కులం గురించి ప్రస్తావిస్తూ వర్మ ట్వీట్

బాహుబలి-2: ప్రభాస్ కులం గురించి ప్రస్తావిస్తూ వర్మ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమపై కులం ప్రభావం బాగా ఉందని.... ఇండస్ట్రీలో టాప్ స్టార్లుగా ఎదిగిన వారంతా తమ తమ కులానికి చెందిన అభిమానుల సపోర్టుతోనే అనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. పరిశ్రమలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఇలాంటి ఆరోపణలకు బలాన్ని ఇచ్చాయి.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ యింది. 'బాహుబలి-2' సినిమా విడుదలై భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రభాస్ కులాన్ని ప్రస్తావిస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం.

ప్రభాస్ కులాన్ని లెక్క చేయలేదు

ప్రభాస్ ఎప్పుడూ తన కులం గురించి ఆలోచించ లేదు. అందుకే ఆయనకు లోక‌ల్ ఫ్యాన్స్ గురించి ఆలోచించాల్సిన ప‌ని లేద‌ని, ఎందుకంటే అత‌నికి నేష‌న‌ల్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్యాన్స్ ఉన్నారు అని వ‌ర్మ ట్వీట్ చేశాడు.

వాళ్లు ఎప్పుడే అక్కడే

వాళ్లు ఎప్పుడే అక్కడే

ఏ స్టార్ అయితే కేవలం రీజనల్ ఫ్యాన్స్ ని పట్టుకుని వ్రేలాడుతాడో వారు ఎప్పటికీ లోకల్ హీరోలుగానే ఉంటారు అంటూ వర్మ ట్వీట్ చేసాడు.

ప్రభాస్ కులంపై ఫోకస్ పెట్టి ఉంటే..

ఇత‌ర హీరోలు తమ తమ కులాలైన కాపులు, క‌మ్మ‌లు ఇలా తదితర వాటిపై శ్ర‌ద్ధ చూపిన‌ట్టు.. ప్ర‌భాస్ త‌న కుల‌మైన‌ రాజులపైనే ఫోక‌స్ పెట్టుంటే ఇంత క్రేజ్ వ‌చ్చేది కాద‌ని వ‌ర్మ ట్వీట్ చేశాడు.

అలా చేస్తే ఇంటర్నేషనల్ స్టార్ అయ్యేవాడు కాదు

అలా చేస్తే ఇంటర్నేషనల్ స్టార్ అయ్యేవాడు కాదు

ప్ర‌భాస్ ఎప్పుడూ కులం సపోర్టు గురించి ఆలోచించ‌లేదు. అందువ‌ల్లే అత‌ను ఇంట‌ర్నేష‌నల్ స్టార్ అయ్యాడని వ‌ర్మ ట్వీట్ చేశాడు.

English summary
"Since Prabhas dint care regional fans he got national and international fans .. Stars who care regional fans will always remain regional. If Prabhas concentrated on Rajulu like others did on Kaapulu kammalu etc he would remain regional..he became international because he dint." RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu