»   » యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హార్స్ రైడింగ్ (ఫోటో)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హార్స్ రైడింగ్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంతో తెరకెక్కుతున్న 'బాహుబలి' చిత్రం కోసం హీరో ప్రభాస్ యుద్ద విద్యలు, గుర్రం స్వారీలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ప్రభాస్ గుర్రపు స్వారీలో శిక్షణ పొందుతున్న దృశ్యాన్ని ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో చూడొచ్చు. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. దీని తర్వాత తన దశ తిరుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు ప్రభాస్.

Prabhas

ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా కోసం ఫిల్మ్ సిటీలో దాదాపు రూ. 2.5 కోట్ల ఖర్చుతో భారీ దర్బార్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.

తాజాగా అందుతున్న మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ప్రస్తుతం ఇక్కడ సినిమాలోని ఓ నిశ్చితార్థం సీన్ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ప్రభాస్, రాణా, అనుష్క, రమ్యకృష్ణ తదితరులు షూటింగులో పాల్గొంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు...టోటల్ భారతీయ సినిమాకే తలమానికంగా ఉండేలా 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి.

ఈ చిత్రంలో ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది.

దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

English summary
Prabhas horse riding Training for Bahubali. Director Rajamouli’s Upcoming Movie Bahubali starring Prabhas, Anushka and Rana Daggubati in main roles is currently shooting at Ramoji Film City, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu