For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్ 'మిర్చి' సక్సెస్ మీట్ విశేషాలు(ఫోటోలతో..)

  By Srikanya
  |

  హైదరాబాద్: ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'మిర్చి'. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. కొరటాల శివ దర్శకత్వం వహించారు. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ నిర్మాతలు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించారు.

  ఫిబ్రవరి 8న విడుదలైన 'మిర్చి' చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపిస్తోంది. సినిమా స్టోరీలో కొత్తదనం లేక పోయినా.... ప్రభాస్ బ్రిలియంట్ అండ్ పవర్ ఫుల్, స్టైలిష్ పెర్ఫార్మెన్స్, కామెడీ సీన్లు ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిచేలా చేస్తోంది. దీనికి తోడు ప్రభాస్ స్టార్ ఇమేజ్ తో సరితూగే హీరోల సినిమాలేవీ బరిలో లేక పోవడం ప్లస్సయింది.

  పెద్ద హీరోల సినిమాలైన నాయక్, SVSCలు విడుదలై దాదాపు నెల రోజులు అవుతుండటంతో ఆయా థియేటర్లలో జన సాంద్రత తగ్గి మిర్చి థియేటర్లలో ఆడియన్స్ పెరిగారు. కొరటాల శివ ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.

  ఈ సక్సెస్ మీట్ లో అనుష్క,ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరి దృష్టీ వీరిపైనే ఉంది.

  బాక్సాఫీసు వద్ద ఈచిత్రం ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్స్ లో బాగా కలెక్టు చేసింది.

  ఇద్దరు హీరోయిన్స్ మధ్యన ప్రభాస్.. సూర్యుడులా వెలిగిపోయారు.

  ''ప్రతి సన్నివేశం విడమర్చి ఈ కథ చెప్పారు కొరటాల శివ. ఆయన మంచి దర్శకుడు అవుతాడని అప్పుడే అనిపించింది. మాస్‌కీ క్లాస్‌కీ నచ్చేలా ఈ సినిమా తీశారు. ఈ సారి మంచి ప్రేమకథ ఏదైనా ఉంటే చెపమన్నాను''అన్నారు ప్రభాస్‌.

  రిచా పాత్రలో ఇమిడిపోయి నటించింది. అనుష్క బంగారంలాంటి హీరోయిన్. అందరినీ బాగా అర్థం చేసుకొంటుంది అని ప్రభాస్ మెచ్చుకున్నారు.

  రిచా గంగోపాధ్యాయ మాట్లాడుతూ ''నా కెరీర్‌లో ఒక మంచి చిత్రమిది. 'మిరపకాయ్‌' తర్వాత మరొక విజయం అందుకొన్నందుకు ఆనందంగా ఉంది. నా మనసుకు నచ్చిన పాత్రలో నటించడం ఎప్పటికీ మరిచిపోలేను''అన్నారు.

  ప్రభాస్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాలో నటీనటులంతా ఇంత బాగా నటించడానికి కారణం దర్శకుడే. ఎంతో పరిణతితో ఆలోచిస్తారు. ఏ తరహా కథైనా రాయగలరు. ఇందులో సంభాషణలు అందరికీ నచ్చేలా ఉన్నాయి. ప్రేమ సన్నివేశాలు పండిన విధానం కూడా చాలా బాగుంది. అందుకే తనతో ఓ ప్రేమకథ చేయాలనుంది. 'వర్షం' నుంచి దేవిశ్రీప్రసాద్‌ నాకు మంచి స్నేహితుడయ్యాడు. తను సమకూర్చే పాటలు పిల్లలు కూడా పాడుకొనేలా ఉన్నాయి. ఈ సినిమాలో పాటలు నాకు చాలా ఇష్టం. సెట్‌ని ఎంతో సౌకర్యవంతంగా ఉంచుతుంది. సత్యరాజ్‌ లాంటి నటుడితో కలిసి నటించడం ఆనందంగా ఉంది''అన్నారు.

  ప్రభాస్ మంచి కో స్టార్ అని.. అతనితో మరోసారి చేయాలని రిచా ఆకాంక్షించింది.

  అనుష్క మాట్లాడుతూ ''ఇందులో వెన్నెల పాత్ర పోషించాను. నా పాత్రను అంత అందంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు. ఆస్వాదిస్తూ ఈ సినిమాలో నటించాను. పండగే దిగి వచ్చె... పాట అంటే నాకు చాలా ఇష్టం. మనసుని హత్తుకొనే పాట అది. ఆ పాట విని కళ్లు చెమ్మగిల్లాయి'' అని చెప్పింది.

  ''నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాపై పెట్టారు. నేను కథ చెబుతున్నప్పుడు ప్రభాస్‌ ఏదైతే నమ్మారో అదే నిజమైంది. కథానాయికలు ప్రాణం పోశారు. సాంకేతిక నిపుణుల సహకారం ఎప్పటికీ మరిచిపోలేను'' అన్నారు దర్శకుడు.

  నిర్మాతలు మాట్లాడుతూ ''దర్శకుడికి ఇదే తొలి సినిమా అయినా... చాలా బాగా తీర్చిదిద్దాడు. ప్రభాస్‌ని చాలా బాగా చూపించాడు. ప్రభాస్‌ కెరీర్‌లో ఈ చిత్రం పెద్ద విజయంగా నిలిచిపోతుంది''అన్నారు.

  ఈ కార్యక్రమంలో దిల్‌ రాజు, రామజోగయ్యశాస్త్రి, కళా దర్శకుడు ఎ.ఎస్‌.ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

  English summary
  Mirchi Success Meet event held at Hyderabad. Prabhas, Anushka Shetty, Richa Gangopadhyay, Dil Raju, Director Koratala Siva, Producer V.Vamsi Krishna Reddy, Pramod Uppalapati, Ramajogayya Sastry graced the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X