»   » ప్రభాస్ న్యూ లుక్: నెక్ట్స్...ఆమెతో సెట్టవుతుందా?

ప్రభాస్ న్యూ లుక్: నెక్ట్స్...ఆమెతో సెట్టవుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ నటించిన ‘బాహుబలి' తొలి భాగం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. జులైలో సినిమా విడుదల కానుంది. ‘బాహుబలి' సెకండ్ పార్ట్ కూడా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రభాస్ నటించాల్సిన భాగం దాదాపుగా పూర్తయిందని సమాచారం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రభాస్ ‘రన్ రాజా రన్' ఫేం సుజీత్ సింగ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. విచిత్రం ఏమిటంటే...ఆరడుగల అందగాడైన ప్రభాస్‌కి జోడీగా బాలీవుడ్ పొట్టి హీరోయిన్ అలియా భట్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ భుజాల వరకు కూడా హైట్ లేని ఆమె ఎలా సెట్టవుతుందో ఏమో?. అయితే ఇది ఓ పుకారు కూడా అయుండొచ్చు!


Prabhas New Look: All Set For His Next

అసలు ఈ వార్తలు ప్రచారంలోకి రావడానికి కారణం.... ప్రభాస్‌కు న్యూ లుక్‌తో కనిపించడమే. ముంబైలో బాహుబలి హిందీ వెర్షన్ ట్రైలర్ ఆవిష్కరణలో భాగంగా రానా, ప్రభాస్ ఇక్కడకు వచ్చారు. భారీ గెడ్డం తీసేసిన ప్రభాస్ హ్యాండ్సమ్ లుక్ తో అదరగొట్టాడు. ప్రభాస్ గెడ్డం తీసేసాడు కాబట్టి తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నాడంటూ వార్తలు ఊపందుకున్నాయి.


బాహుబలి కోసం ప్రభాస్ గత కొన్ని నెలలుగా భారీ గడ్డంతో ఉండాల్సి వచ్చింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ గడ్డం తీసేసి ఫ్రెష్ లుక్ లో కనిపించడంతో అందరినీ ఆకట్టుకుటోంది. మరి ప్రభాస్ నెక్ట్స్ స్టెప్ ఏమిటి? సినిమా చేస్తాడా? లేక పెళ్లి చేసుకుంటాడా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

English summary
While Baahubali and the euphoria just started taking off, Prabhas has already made his plans ready to move on to his next. It is known that Prabhas will be working with Sujeeth Sign of Run Raja Run fame after Baahubali The Beginning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu