»   » లక్ష కోట్లిచ్చినా ఈ సారి బాహుబలి చేయను : ప్రభాస్ ఎందుకంత విసిగిపోయాడు

లక్ష కోట్లిచ్చినా ఈ సారి బాహుబలి చేయను : ప్రభాస్ ఎందుకంత విసిగిపోయాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా స్టామినాని దేశానికే కాదు, ప్ర‌పంచానికి తెలియ‌చెప్పిన సినిమా బాహుబ‌లి. విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన ఈ సినిమా పార్ట్‌ 1 సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఇప్పుడు అంద‌రూ బాహుబ‌లి పార్ట్ 2 కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సిరీస్ లో రెండోవ భాగం బాహుబలి: ది కంక్లూజన్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసేసుకున్న సంగతి తెలిసిందే.

లక్షకోట్ల బడ్జెట్ అయినా

లక్షకోట్ల బడ్జెట్ అయినా

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడటం తో టీమ్ మొత్తం కూడా ప్రమోషన్ లలో మునిగిపోయారు.అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్... ఈ సారి వచ్చే సినిమా లక్షకోట్ల బడ్జెట్ అయినా సరే మళ్ళీ బాహుబలి లాంటి సినిమా అయితే చేయనంటే చేయనంటూ ఖరాఖండి గా చెప్పేసాడు....
 స్కూల్‌కి వెళ్లినట్టుంది

స్కూల్‌కి వెళ్లినట్టుంది

బాహుబలి' సినిమా తీసినన్ని రోజులూ స్కూల్‌కి వెళ్లినట్టుంది అన్నారు! అంత కష్టపడ్డారా? అన్న ప్రశ్నకి సమాధానం చెప్తూ... నిజమే. ఓ సీన్‌ తీయడానికి 30, 40 లక్షలంట! వన్‌మోర్‌ చెబితే... అన్నీ సెట్‌ చేయడానికి 3, 4 గంటలు పట్టేది. పైగా, ఎంతో లాస్‌.


భయపడేవాణ్ణి

భయపడేవాణ్ణి

అందువల్ల, త్వరగా నిద్రలేచి షూటింగ్‌కి వెళ్లాలనుకునేవాణ్ణి. దాంతో స్కూల్‌కి వెళ్లినట్లనిపించింది. ‘మిర్చి'కి నా స్నేహితులే నిర్మాతలు అప్పుడు మరీ ఇంత స్ట్రిక్ట్ టైమింగ్స్ పాటించేవాన్ని కాదు . ఇక్కడ కూడా రాజమౌళి కి తొమ్మిదింటికి షూటింగ్‌కి వస్తానని చెప్పొచ్చు. ఒకవేళ రాజమౌళి వింటాడనుకున్నా... నిర్మాతల ఖర్చు చూసి నేనే భయపడేవాణ్ణి. అంటూ బాహుబలి వెనుక తాను పడ్డ కష్టాన్ని కూడా చెప్పేసాడు.


‘బాహుబలి’ లాంటి సినిమా చేయను

‘బాహుబలి’ లాంటి సినిమా చేయను

మరి ‘బాహుబలి'తో ఇంత గుర్తింపు సంపాదించారు కదా.. ఇలాంటి సినిమా ఇంకోటి చేయాల్సి వస్తే చేస్తారా అని ప్రభాస్ ను ప్రశ్నిస్తే.. వామ్మో నా వల్ల కాదంటున్నాడు. లక్ష కోట్లిచ్చినా.. వెంటనే ‘బాహుబలి' లాంటి సినిమా ఇంకోటి చేయనని అతను తేల్చి చెప్పాడు.


కనీసం నాలుగేళ్ల పాటు

కనీసం నాలుగేళ్ల పాటు

‘‘బాహుబలి కోసం పడ్డ కష్టం అలాంటిలాంటిది కాదు. లక్ష కోట్లు ఇస్తానని చెప్పి ఎవరైనా బాహుబలి లాంటి ఇంకో సినిమా చేయమని అడిగినా చేయను. కనీసం నాలుగేళ్ల పాటు ఇలాంటి ఆలోచన చేయను. ఆ తర్వాత ఏమైనా చూడాలి'' అని ప్రభాస్ అన్నాడు. అయినా అంతంత డబ్బులు పెట్టే నిర్మాతల గురించి ఆలోచించకపోతే ఎలా? ప్రభాస్ కష్టానికి తగ్గ ఫలితం పొందినట్టే మరి బాహుబలి 2 కూడా విడుదలకుముందే సూపర్ హిట్ అయిపోయినట్టే


English summary
Prabhas who played a roale as Amarendra Bahubali and shiva (Mahendra bahubali) in SS Rajamauli's Tollywood Maha Movie Bahubali, said He is Not Ready for Projects Like Baahubali For Next Four years
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu