ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు.. రాజమౌళి, ఫ్యాన్స్‌కు లేఖ రాశాడు.. అసలేంటంటే..

బాహుబలి చిత్రం రిలీజ్ అయి రెండేళ్ల దాటిన సందర్భంగా సినీ పరిశ్రమలో తనకు అరుదైన గౌరవాన్ని కల్పించిన రాజమౌళి, ఫ్యాన్స్‌కు ప్రభాస్ ఉద్వేగ భరితమైన లేఖను రాసి తన అభిమానాన్ని చాటుకొన్నారు.

By Rajababu

బాహుబలి సినిమా తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాత్ర ద్వారా ప్రభాస్ జాతీయస్థాయి నటుడిగా మారారు. బాహుబలి ఇచ్చిన అరుదైన గౌరవం, సంచలన విజయానికి సంబంధించిన మధురస్మృతులు ఇంకా వారి జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. బాహుబలి చిత్రం రిలీజ్ అయి రెండేళ్ల దాటిన సందర్భంగా సినీ పరిశ్రమలో తనకు అరుదైన గౌరవాన్ని కల్పించిన రాజమౌళి, ఫ్యాన్స్‌కు ప్రభాస్ ఉద్వేగ భరితమైన లేఖను రాసి తన అభిమానాన్ని చాటుకొన్నారు.

వెంటాడుతున్న బాహుబలి జ్ఞాపకాలు

వెంటాడుతున్న బాహుబలి జ్ఞాపకాలు

బాహుబలి ది బిగినింగ్ విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకొన్నది. బాహుబలి సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఒక తపనతో మొత్తం చిత్ర యూనిట్ కష్టపడే సన్నివేశాలు జ్ఞాపకాల తెరముందు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమాను, నా కెరీర్‌ను మహోన్నతమైన స్థాయికి తీసుకెళ్లిన ఫ్యాన్స్, సినీ అభిమానులకు కృతజ్ఞత తెలుపడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని భావించాను అని ప్రభాస్ తన లేఖలో పేర్కొన్నారు.

Recommended Video

Prabhas written an emotional letter to his fans and Rajamouli
అందరికీ నా కృతజ్ఞతలు..

అందరికీ నా కృతజ్ఞతలు..

బాహుబలి ద్వారా తెలుగు సినిమా పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి అండగా నిలిచిన చిత్ర యూనిట్‌కు, మిత్రులకు, సన్నిహితులకు నా కృతజ్ఞతలు. అందుకు నేను రుణపడి ఉంటాను. మీరు అందించిన సపోర్ట్ మరువలేనిది. నాపై నమ్మకం పెట్టుకొన్న రాజమౌళికి నేను రుణపడి ఉంటాను అని ప్రభాస్ లేఖలో వెల్లడించారు.

బాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు

బాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు

బాహుబలి తర్వాత ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ కోరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా రూపొందించే చిత్రానికి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాల ద్వారా ప్రభాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై మీడియాలో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

క్యూ కడుతున్న దర్శక, నిర్మాతలు

క్యూ కడుతున్న దర్శక, నిర్మాతలు

ప్రముఖ దర్శకులు కరణ్ జోహార్, రోహిత్ శెట్టి, సాజిద్ నడియావాలా రూపొందించే చిత్రాల్లో ప్రభాస్ నటించే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇంకా పలువురు బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇంతటి రేంజ్‌ను ఇచ్చిన బాహుబలి రిలీజ్‌ను గుర్తుపెట్టుకొని అందరిని తలుచుకొంటూ ధన్యవాదాలు తెలుపడం ప్రభాస్‌ మంచి తనానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X