»   »  ప్రభాస్ కోసం ప్రత్యేకంగా క్లాసెస్...?

ప్రభాస్ కోసం ప్రత్యేకంగా క్లాసెస్...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమాతో ప్రభాస్ బాలీవుడ్లో కూడా బాగా పాపులర్ అయ్యాడు. నిన్న మొన్నటి వరకు కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే ప్రభాస్ తెలుసు. ఇపుడు ఇండియాలో ఎవరినీ అడిగినా ప్రభాస్ ను ఇట్టే గుర్తు పట్టేస్తారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తో మహీంద్రా లాంటి ప్రముక కంపెనీలు యాడ్స్ చేసాయి. బాలీవుడ్ నుండి కూడా ప్రభాస్‌కు ఆఫర్లు వస్తున్నాయి.

ఈ నేపత్యంలో ప్రభాస్‌ హిందీ బాషపై పట్టు సాధించే పనిలో ఉన్నాడు. అందుకోసం ప్రత్యేకంగా హిందీ పాఠాలు నేర్చుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలో బాహుబలి-2 కూడా విడుదల కాబోతోంది. అప్పుడు బాలీవుడ్ ప్రమోషన్లలో హిందీలో మాట్లాడాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడట.

బాహుబలి మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే కాదు... ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలనం. ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషల్లో కలిపి ఈ చిత్రం దాదాపు 650 కోట్లు వసూలు చేసిన అందరినీ ఆశ్చర్య పరిచింది.

 Prabhas Planning To Learning Hindi

త్వరలో బాహుబలి సినిమాను టీవీల్లో ప్రసారం చేయబోతున్నారు. అక్టోబర్ 25న బాహుబలి తెలుగు వెర్షన్ మాటీవీలో ప్రసారం కానుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఈ సినిమాకు వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మధ్యలో ప్రసారం అయ్యే యాడ్స్ రేటు కూడా భారీగా రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం.

10 సెకన్ల యాడ్ కోసం పలు కంపెనీలు రూ. 2.5 లక్షలు చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ సినిమాకు యాడ్స్ ఇంత ఖరీదుగా లేవు. దీన్ని బట్టి బాహుబలి సినిమాపై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి రెండు పార్టులు కలిపి శాటిలైట్ రైట్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసారు. మరి ఇంత భారీ మొత్తం తిరిగా రావాలంటే యాడ్స్ రేట్లు ఈ మాత్రం ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

English summary
Baahubali star Prabhas Planning To Learning Hindi.
Please Wait while comments are loading...