Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Good Luck Sakhi Teaser చలాకీ ‘సఖి’.. మరోసారి కీర్తి నట విశ్వరూపం!!
మహానటి కీర్తి సురేష్ మరోసారి తన నటననతో అందర్నీ మెప్పించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పెంగ్విన్ సినిమాతో లాక్డౌన్ కాలంలో అందర్నీ ఆకట్టుకుంది. సినిమా అంతగా వర్కౌట్ కాకపోయిన కీర్తి సురేష్ నటన అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఇక మహానటి తరువాత మళ్లీ ఆ రేంజ్‌లో నటించి మెప్పించేందుకు సఖిగా మన ముందుకు రాబోతోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది. అయితే నేటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు.
Recommended Video

పోస్టర్ వైరల్..
రెండ్రోజుల క్రితం రిలీజ్ చేసిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. పల్లెటూరి పిల్లలా కీర్తి సురేష్ తన్మయత్వానికి గురవుతూ ఆనందంలో మునిగిపోతోన్న పోస్టర్‌ను రిలీజ్ చేయగా అందర్నీ ఆకట్టుకుంది. ఇక కాసేపటి క్రితం విడుదల చేసిన గుడ్ లక్ సఖి టీజర్ అందర్నీ ఫిదా చేసేస్తోంది.

ప్రభాస్ చేతుల మీదుగా..
తమిళ,
తెలుగు,
మలయాళి
భాషల్లో
రిలీజ్
చేయబోతోన్న
గుడ్
లక్
సఖి
టీజర్
విడుదలైంది.
ఈ
సినిమా
టీజర్‌ను
తెలుగులో
ప్రభాస్,
తమిళంలో
విజయ్
సేతుపతి
విడుదల
చేశారు.
ఇందులో
కీర్తి
సురేష్
నటనే
ప్రధాన
ఆకర్షణగా
నిలిచేట్టు
కనిపిస్తోంది.
సఖి
పాత్రలో
కీర్తి
సురేష్
అదరగొట్టినట్టు
కనిపిస్తోంది.

అల్లరి పిల్లగా..
బ్యాడ్ లక్‌ను వెంటేసుకుని తిరిగే సఖి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం ఉండోబోతోందని తెలుస్తోంది. పెళ్లి చేసుకోవడానికి వచ్చే పెళ్లి కొడుకు కూడా మధ్యలోనే వెనుదిగిరే అంత దురదృష్టాన్ని వెంట వేసుకుని తిరిగే సఖి పాత్రలో కీర్తి సూపర్‌గా నటించింది.
స్పెషల్ అట్రాక్షన్..
ఇక కీర్తి గెటప్, భాష, యాస అన్నీ ప్రత్యేకంగా నిలవబోతోన్నట్టు కనిపిస్తోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబుల క్యారెక్టర్స్ మరింత ఆకర్షణగా ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. గ్రామీణ స్థాయి సాధారణ అమ్మాయి నుంచి షూటర్‌గా ఎదిగే క్రమంలో కీర్తికి ఎదురైన సంఘటనలు ఆకట్టుకునేలానే ఉన్నాయి. నాగేశ్ కుకునూర్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.