»   » ప్రభాస్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' స్టోరీ లైన్ ఏమిటి?

ప్రభాస్ 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' స్టోరీ లైన్ ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రోడ్ సైడ్ రోమియో ఓ అమ్మాయితో ప్రేమలో పడి మిస్టర్ ఫెరపెక్ట్ గా మారటమే మిస్టర్ ఫెరఫెక్ట్ కధాంశం.దేముడు నమ్మని హీరో తన ప్రేయసి కోసం రోజూ గుడికి వెళ్ళతాడు.అయితే ఆమె దానికి తృప్తి పడక తన తండ్రి కోసం ఇంకా ఫెరఫెక్ట్ గా మారమని సతాయిస్తుంది.దాంతో హీరో..నేను నిన్ను ప్రేమించాను గానీ..నీ అబ్బను కాదు అని తప్పుకుంటాడు. ఈ సిట్యువేషన్ ఆ ప్రేమకుల మధ్య అంతులేని అగాధాన్ని ఏర్పాటు చేస్తుంది.ఆ తర్వాత అతని జీవితంలో మరో అమ్మాయి వస్తుంది.అక్కడ నుంచి ఏం జరిగింది.తన ఏటిట్యూడ్ సమస్యను హీరో ఎలా సాల్వ్ చేసుకుని ఆమెకు ఎలా దగ్గరయ్యాడనేది మిగతా కధ.

ఇక నిర్మాత దిల్ రాజు ఈ చిత్రంతో కధా రచయిత అవతారమెత్తారు. దశరధ్, ప్రభాస్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రంకి ఆయనే స్టోరీ అందించానని చెప్తున్నారు. అందుకే కథ..శ్రీ వెంకటేశ్వర యూనిట్ అని పడుతుందని, ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి నిర్మాత కథ ఇచ్చినప్పుడు అలా వేయటం ఆనవాయితీగా వస్తోందని, తాను అదే చేస్తున్నానని అన్నారు.

కాజల్, తాప్సి నాయికలు. ప్రకాష్‌ రాజ్, కె.విశ్వనాథ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నాజర్, షిండే, రఘుబాబు, కాశీ విశ్వనాథ్, మాస్టర్ భరత్, బెనర్జీ, రాజా రవీంద్ర, సమీర్, ప్రభాస్ శ్రీను, దువ్వాసి మోహన్, కౌశల్, భగవాన్, తులసి, ప్రగతి, రజిత, సుదీప, ఉషాశ్రీ, అనితానాథ్, సంధ్యా ఝనక్, ప్రభావతి తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, కథ, దర్శకత్వం: దశరథ్.కె.

English summary
Roadside Romeo become Mr.Perfect for his love with a girl. This guy who doesn't believe in God starts going to temple every day for his lover.But that still demands much more perfection to satisfy her Dad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu