»   »  పుట్టిన రోజు బహుమతి గా "బాహుబలి కత్తి" : హీరో కొడుక్కి కత్తి ఇచ్చిన ప్రభాస్

పుట్టిన రోజు బహుమతి గా "బాహుబలి కత్తి" : హీరో కొడుక్కి కత్తి ఇచ్చిన ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Prabhas Has Sent Baahubali Replica Sword To Star Hero's Son

బాహుబ‌లి ఎంత స‌క్సెస్ సాధించిందో స్పెష‌ల్‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌తీయ సినిమాని కొత్త మ‌లుపు తిప్పిన మూవీ అది. ఆ సినిమా ప్ర‌భాస్‌ని నేష‌న‌ల్ స్టార్‌ని చేసింది. ఆ సినిమాలోని మ‌రో ప్ర‌త్యేక‌త ప్ర‌భాస్ ధ‌రించిన ఖ‌డ్గం. అది ఎంతో పాపుల‌ర్ అయింది. సినిమాకి హైలైట్‌గా మారింది.

ఆ క‌త్తిని ఇప్పుడు ప్ర‌భాస్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.అది ఎవ‌రికో తెలుసా...? విరాట్‌కి.. ఇంత కీ ఎవరీ విరాట్ అంటే... తమిళ లెజండరీ హీరో.. శివాజీ గణేష్ మనవడు.. హీరో ప్రభు కుమారుడైన విక్రమ్ ప్రభు తమిళనాట ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. 2007లో పెళ్లి చేసుకున్న విక్రమ్ ప్రభుకు కొడుకుపేరే విరాట్... విరాట్‌కు ప్రభాస్ అంటే వీరాభిమానం.

ప్రస్తుతం తమిళ చిత్రం 'నెరుప్పుడా'లో నటిస్తున్న విక్రమ్ ప్రభు కుమారుడు విరాట్ కు, హీరో ప్రభాస్ మరచిపోలేని బహుమతిని పంపించాడు. ఈ నెలలో విరాట్ పుట్టిన రోజును జరుపుకోనుండగా, కానుకగా, 'బాహుబలి' ఖడ్గాన్ని పంపాడు. దానిపై టు విరాట్‌.. విత్ ల‌వ్ ప్ర‌భాస్ అని రాసి ఉంది. ఆ బ‌హుమ‌తిని చూసి విరాట్ ఆనంద‌భ‌రితుడ‌య్యాడ‌ట‌.


ఇక విక్ర‌మ్ ప్ర‌భు తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్‌కి బ‌హుమ‌తిగా ఇచ్చిన క‌త్తి ఫోటోని పోస్ట్ చేసి ..స్వీటెస్ట్ ప‌ర్స‌న్ నుండి అందుకున్న గొప్ప బ‌హుమతి.. ధ‌న్య‌వాదాలు అని కామెంట్ పెట్టాడు. విక్ర‌మ్ ప్ర‌భు ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌భు గ‌ణేష‌న్ కుమారుడు కాగా, శివాజీ గ‌ణేష్ మ‌న‌వ‌డు.

ప్ర‌స్తుతం విక్ర‌మ్ నెర‌ప్పుడా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో నిక్కీ గాల్రానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సెప్టెంబ‌ర్ 8న ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రో వైపు ప్ర‌భాస్ సాహో చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ కథానాయిక‌గా న‌టిస్తుంది.

English summary
With Baahubali, Prabhas has become a superhero to kids in India that even Tamil actor Vikram Prabhu’s son Virat is not an exception. For Virat’s upcoming birthday, Prabhas has sent a Baahubali replica sword with his name written on it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu