చనిపోయిన వర్షం దర్శకుడిని గుర్తు చేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు అతని కొడుకు కోసం..
రెబల్ స్టార్ ప్రభాస్ మంచితనం గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక వ్యక్తి చేసిన సహయాన్ని స్నేహాన్ని ఎన్నటికీ మర్చిపోడు. తన స్థాయి పాన్ ఇండియా వరకు వచ్చినా కూడా మొదటి అడుగులను ఏ మాత్రం మర్చిపోలేదు. ఇక రెబల్ స్టార్ కెరీర్ కు మంచి హిట్స్ ఇచ్చిన ఒకప్పటి దర్శకుడిని కూడా గుర్తుచేసుకున్న ప్రభాస్ ఇప్పుడు అతని కొడుకు కెరీర్ కోసం తనవంతు సహాయం చేస్తున్నాడు.

బ్రాండ్ కు తగ్గట్లుగానే
ప్రభాస్ కెరీర్ ఈశ్వర్ సినిమాతో మొదలైన విషయం తెలిసిందే. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజు గారు బ్రాండ్ కు తగ్గట్లుగానే వెండితెర రారాజు చక్రం తిప్పుతున్నాడు. టాలీవుడ్ స్థాయిని మరో లెవెల్ కు తీసుకువెళ్ళేలా వరుసగా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.

ఎవరిని మర్చిపోలేదు
ఇక అతని చుట్టూ ఎక్కువగా స్నేహితులే ఉంటారని అందరికి తెలిసిన విషయమే. చాలా వరకు వివాదాలు దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ తోనే బిజీగా ఉంటాడు. స్నేహితులు పక్కన ఉంటే చాలు ప్రభాస్ కు మరొకరు అవసరం ఉండదు. అంతగా మనుషులను ఆప్యాయంగా చూసుకునే డార్లింగ్ తన కెరీర్ కు ఉపయోగపడిన ఎవరిని మర్చిపోలేదు.

దర్శకుడు మరణించడంతో..
ప్రభాస్ కెరీర్ లో మొదటి అసలైన విజయం వర్షం సినిమాతోనే దక్కింది. దర్శకుడు శోభన్ ప్రభాస్ ను ఏరికోరి మరి సెలెక్ట్ చేసుకున్నాడు. అనంతరం ప్రభాస్, శోభన్ తో మరో సినిమా చేయాలని కూడా అనుకున్నాడు. అయితే కొన్నాళ్ల తరువాత శోభన్ గుండెపోటుతో మరణించాడు. ఇక అతని ఫ్యామిలీకి అప్పటి నుంచి ప్రభాస్ అండగా ఉంటున్నాడు.

ప్రభాస్ సపోర్ట్..
శోభన్ కొడుకు సంతోష్ శోభన్ కెరీర్ ను సెట్ చేయాలని ప్రభాస్ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. యూవీ క్రియేషన్స్ సపోర్ట్ తోనే యూవీ కాన్సెప్ట్ లో ఏక్ మినీ కథ సినిమా చేయించిన ప్రభాస్ ఆ సినిమాకు ప్రమోషన్ చేయడానికి కూడా రెడీ అయ్యాడు. సినిమా ట్రైలర్ నేడు విడుదల కావడంతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక వివరణ ఇచ్చారు.
Recommended Video

నా కెరీర్ లోనే బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ
'వర్షం నా కెరీర్ లోనే బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ. మరచిపోలేని ఒక మంచి సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ శోభన్ గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన కొడుకు సంతోష్ శోభన్ సినిమా ఏక్ మినీ కథ అమెజాన్ ప్రైమ్ లో మే 27వ తేదీన విడుదల కానుంది. ఇక సినిమాను నిర్మించిన నా ఫ్రెండ్స్ యూవీ క్రియేషన్స్ కు అలాగే సినిమాకు వర్క్ చేసిన అందరికి నా బెస్ట్ విషెస్'.. అంటూ ప్రభాస్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











